విపక్షాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అవినీతి తప్ప అభివృద్ధి లేదన్న విమర్శకలకు జవాబిచ్చారు. టీఆర్ఎస్ సర్కార్ 8 ఏళ్లలో సాధించిన విజయాల జాబితాని కేసీఆర్ విడుదల చేశారు..
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురుని పోలీసులు అరెస్టు చేశారు.నిన్ననే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ ముగ్గురినీ అరెస్టు చేశారు. కర్నాటక, తమిళనాడులో వీరిని అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు.నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు.
దేశ వ్యాప్తంగా రాజకీయాలు దేవాలయాలు, మసీదుల చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలోని కుతుబ్ మినార్, ఉత్తరప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు వివాదాలకు కేంద్ర బిందువులు కాగా.. ప్రస్తుతం చార్మినార్, భాగ్యలక్ష్మి దేవాలయం సైతం వివాదంలోకి అడుగు పెట్టాయి. బీజేపీ, కాంగ్రెస్ వార్ కు అసలు కారణమేంటి?
విద్యా రంగంలో చేసినన్ని ప్రయోగాలు బహుశా మరే రంగంలో ఏ ప్రభుత్వమూ చేపట్టి ఉండదు. విద్యార్థుల జీవితాలను భవిష్యత్ కు సారథులుగా రూపొందించవలసిన బృహత్తరబాధ్యత ఈ రంగానిదే. భావి పౌరులకు చక్కని చుక్కానిలా ముందుకు నడిపించేదీ ఈ రంగమే. తాజాగా మెరుగైన ఫలితాల సాధన లక్ష్యంగా కొన్ని మార్పులు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది.
అనకాపల్లిలో గ్యాస్ లీక్ కలకలం రేపుతోంది. అచ్చుతాపురం బ్రాండిక్స్ సెజ్ పరిధిలోని పోరస్ కంపెనీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం అమ్మోనియా గ్యాస్ లీకైంది. దీంతో కంపెనీలోని ఉద్యోగులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్యాస్ లీకైందన్న వార్త వ్యాపించడంతో జనాలు భయంతో పరుగులు పెట్టారు .
భారత దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోన్న సూచనలు కనబడుతున్నాయి.కేవలం కొద్ది రోజుల్లోనే వేలాదిగా కేసులు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఈ విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో బహిరంగ ప్రదేశాల్లో మళ్లీ మాస్క్ మస్ట్ చేశారు.
రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం 100 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో భారత్ వైఖరిపై యూరప్ దేశాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉక్రెయిన్ పరిస్థితి పట్ల భారత్ స్పందించాలని యూరప్ గట్టిగా వాదిస్తోంది. భారత్ విదేశాంగ విధాన వైఖరిని దుమ్మెత్తి పోస్తోంది.
సెలిబ్రెటీ అయినా సామాన్యుడైనా తమ జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలను మర్చిపోలేరు. అవి మంచి జ్ణాపకాలైతే ఆ మధుర క్షణాలను అసలు మర్చిపోలేరు. జీవితాంతం అవి వాడిపోకుండా పదిలంగా దాచుకుంటారు..సందర్భం వచ్చినప్పుడల్లా ఆ మధుర జ్ణాపకాలను పంచుకునేందుకు ఏ మాత్రం వెనకాడరు.
అమెరికాలో ఒక్కసారిగా పెరిగిన 'తుపాకీ హింస'కు, వేడి వాతావరణానికి లింక్ ఉందా ? క్లైమేట్ ఛేంజ్ కారణంగా దేశంలో పలు చోట్ల గన్ వయొలెన్స్ ఘటనలు పెరుగుతున్నాయా..? అంటే అవునని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల టెక్సాస్ స్కూల్లో జరిగిన ఊచకోత నుంచి తుల్సా హాస్పిటల్ ఘటనవరకు వివిధ సంఘటనలను విశ్లేషిస్తే.. ఇలా అంచనా వేయవలసి వస్తుందంటున్నారు.
చిన్న పిల్లలను బడికి పంపడం తల్లిదండ్రులకు ఒక పెద్ద టాస్క్. అప్పటి వరకూ కుటుంబ సభ్యులు, పక్కింటి పిల్లలతో ఆడుతూ పాడుతూ గడిపిన పసితనంలోనే క్రమశిక్షణగా ఉండాలంటూ రిస్ట్రిక్షన్స్ పెడితే ఆ పసి మనసుకు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో స్కూలుకి వెళ్లడానికి మారాం చేస్తారు. ఇక ఇప్పుడు ప్రి స్కూల్స్ వచ్చేశాయి. బడి వయసు కంటే ముందుగానే స్కూలుకు వెళ్లాల్సి ఉంటుంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ మామూలోడు కాడు. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియురాలు, జిమ్నాస్ట్ అలీనా కబయేవా గౌరవార్థం పుతిన్ జిమ్నాస్టిక్ ఫెస్టివల్‌ను నెల కిందట నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అలీనా ఫెస్టివల్ అని పేరు పెట్టారట.
ఇటీవల కాలంలో దక్షిణాది చిత్రాలపై బాలివుడ్ నటులు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఆయా నటులను విపరీతంగా ట్రోలు చేస్తున్నారు. చారిత్రక నేపద్యంతో తెరకెక్కిన సామ్రాట్ పృథ్వీరాజ్ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పద్మావత్, కేసరి, బాజీరావు మస్తానీ వంటి చిత్రాల తరువాత బాలీవుడ్లో విడుదలైన మరో చారిత్రాత్మక చిత్రం సామ్రాట్ పృథ్వీ రాజ్. మోస్ట్ సక్సెస్ ఫుల్ బాలీవుడ్ హీరో.. సంవత్సరానికి 1000 కోట్లు సంపాదించే ఏకైక సూపర్ స్టార్ అక్షయ్ కుమార్.. సామ్రాట్ పృథ్వీ రాజ్ పాత్రలో నటించటంతో పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. అక్షయ్‌తో పాటు సంజయ్ దత్, సోనుసూద్, మనూషి చిల్లర్ వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు.
ది హిట్ మ్యాన్ బాడీ గార్డ్, హిట్ మ్యాన్ వైఫ్ బాడీగార్డ్ ,ఎక్స్ పెండబుల్స్ వంటి ఉన్మాదపు యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయినా పాట్రిక్ హ్యూస్ దర్శకత్వంలో.. కెవిన్ హార్ట్, వుడీ హారెల్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ది మ్యాన్ ఫ్రమ్ టొరంటో' ట్రైలర్ తాజాగా నెట్ ఫ్లిక్స్ విడుదలై దుమ్ములేపుతుంది. జూన్ 24న ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు.. ఆ సంప్థ వెల్లడించింది.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లు ఈ ఏడాది కాస్తా నెమ్మదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విడి భాగాల కొరత అని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ షిప్మెంట్ మూడు శాతం క్షీణించే అవకాశాలున్నాయి. స్మార్ట్ ఫోన్ల జోరు తగ్గడానికి కారణాలేంటి?
భారత్ లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ అంతకంతకూ పెరిగిపోతోంది. రోజు రకరకాల ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో చాలా మంది తమ పాతఫోన్ల స్థానంలో కొత్త ఫోన్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫాస్టెస్ ఇంటర్నెట్ బెస్ట్ కనెక్టివిటీ కోసం 5జీ ఫోన్లను అందిస్తున్నాయి టాప్ బ్రాండ్స్.
రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాబోయే నెలల్లో కీలక వడ్డీరేట్లు పెంచాలనే ఆలోచనలో ఉంది. కఠినమైన ద్రవ్యపరపతి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నిర్వహించిన పోల్‌లో దాదాపు అందరూ ఆర్థికవేత్తలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరి అంచనా ప్రకారం రెపో రేటు వచ్చే ఏడాది ప్రారంభానికి మరింత పెరిగే అవకాశం ఉందని తేల్చి చెబుతున్నారు.
వేసవి వేడి వల్ల శరీరం తరచూ డీహైడ్రేట్(నిర్జలీకరణం) అయిపోతుంది. తద్వారా ఎనర్జీ లెవెల్స్ పడిపోయి తొందరగా అలసిపోతాం. ఇలాంటి సమయాల్లో ఆరోగ్యకరమైన, రుచికరమైన పానీయం తక్షణ శక్తిని అందించి, మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి సమ్మర్ డ్రింక్స్ కోసం పసుపు(హల్దీ)ని కూడా ఉపయోగించవచ్చని చాలా మందికి తెలియదు.
గుండె పోటు. యువతకు పెను ముప్పుగా మారుతోంది. ఇటీవలి కాలంలో చాలా చిన్న వయసులోనే ముగ్గురు సెలబ్రిటీలు హఠాత్త్గా ప్రాణాలు కోల్పోవడంతో ఈ సమస్య అందరిలో ఆందోళనకు కారణంగా మారింది. పునీత్ రాజ్ కుమార్, సిద్ధార్థ శుక్లా, ఇప్పుడు కెకె ముగ్గురూ గుండె పోటు కారణంగానే అకాల మరణానికి గురయ్యారు.
కాలిఫోర్నియా యూనివర్శిటీ - లాస్ ఏంజెల్స్ హెల్త్ సైన్సెస్ జరిపిన కొత్త అధ్యయనం ప్రకారం మన మెదళ్లు విడివిడి జ్ఞాపకాలను కాకుండాక కొన్ని జ్ఞాపకాల గ్రూప్ స్టోర్‌ని నమోదు చేస్తాయని తెలిపింది. అందుచేత, ఒక నిర్దిష్ట మెమొరీని రీకలెక్ట్ చేసుకుంటున్నప్పుడు అది ఇతర జ్ఞాపకాలను కూడా రీకాల్ చేయగల విడి మెమరీని ప్రేరేపించదగలదని వీరు చెబుతున్నారు.
ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌లో టాప్ 100లో 4 భారత విశ్వవిద్యాలయాలు స్థానం సంపాదించుకున్నాయి. ఇక టాప్ 200లో 17 భారత యూనివర్సిటీలు స్థానం సంపాదించుకున్నాయి. అవేంటో తెలుకోండిలా..
నీట్ పీజీ (NEET PG) 2022 ఫలితాలను వైద్య శాస్త్రాల్లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వారు బుధవారం ప్రకటించారు. ఆల్ ఇండియా మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలో డాక్టర్ షాగన్ బాత్రా టాపర్‌గా నిలిచారు. డా. జోసెఫ్, డాక్టర్ హర్షితలు తర్వాత స్థానాల్లో నిలిచారు.
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ,IIFA అవార్డ్స్ 2022 వేడుగ అబు దబిలో అంగరంగ వైభవంగా జరగనుంది. బాలీవుడ్ బడా సెలబ్రిటీలు ఈ వేడుకల్లో పాల్గొని ఫ్యాన్స్‌ను ఖుషి చేయనున్నారు. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచెలర్ సల్మాన్ ఖాన్ ఈ అవార్డ్స్ ఫంక్షన్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు.
అనార్కలీతో అదరగొట్టాలన్నా, చూడీదార్తో ఫిదా చేయాలన్నా, చీరకట్టుతో ఓ ఊపు ఊపాలన్నా అలనాటి మేటి నటి డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ తరువాతే. తన కెరీర్ సెకండ్ హాఫ్లోనూ తన అందాలతనో అందరిని మెస్మరైజ్ చేస్తోంది ఈ బ్యూటీ. అదరిపోయే అవుట్‌ఫిట్స్‌తో ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేస్తోంది. ఎత్నిక్ అవుట్‌ఫిట్స్‌కు కేరాఫ్‌గా ఉన్న మాధురీ దీక్షిత్ తాజాగా మరో అదరిపోయే చీరకట్టుతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది.
ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ పోరు ముగిసింది. ఫైనల్ పోరులో ఎవరు ఆడేది క్లారిటీ వచ్చేసింది. ఈ టోర్నీలో విజేత ఎవరో మరికొన్ని గంటట్లో తేలనుంది. తొలి సెమీస్ పోరులో రఫెల్ నాదల్ నెగ్గాడు. ఆట మధ్యలో జ్వెరెవ్ గాయపడడంతో నాదల్ ఫైనల్ చేరుతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. తొలి సెట్‌ను నాదల్ అతి కష్టం మీద నెగ్గాడు. రెండో సెట్ కూడా హోరాహోరీగా జరుగుతున్న వేళ...జ్వెరెవ్ ఆడలేని పరిస్థితి నెలకొంది.
ప్రస్తుత కాలంలో 60 ఏళ్లకు రిటైర్ అవుతున్నవాళ్లంతా ఏ పనీ లేకుండా ఇంటిలోనే కాలక్షేపం చేస్తున్నారు. ఎటువంటి లక్ష్యం లేకుండా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం 77 ఏళ్ల వయసులోను నిరంతరం శ్రమిస్తున్నాడు. కలలు సాకారం చేసుకోడానికి తపిస్తున్న కొందరు వ్యక్తులకు సాయం అందిస్తున్నాడు. వాళ్లను ఛాంపియన్లుగా తీర్చిదిద్దుతున్నాడు. ఆ వ్యక్తే ఈమని చిరంజీవి.
ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ తుది దశకు చేరుకుంది. మహిళా విభాగంలో ఫైలన్ బెర్తులు ఖరారయ్యాయి. ఇగా స్వాయితెక్, కోక్ గౌఫ్లు తుదిపోరుకు చేరుకున్నారు. సెమీస్‌లో వారిద్దరూ తమ తమ ప్రత్యర్దులపై గెలిచి ఫైనల్ చేరుకున్నారు. పురుషల విభాగంలో నాదల్, జ్వెరెవ్, కాస్పర్ రుడ్, మారిన్ సిలిక్లు సెమీస్ పోరుకు సిద్ధమయ్యారు. వీరి నలుగురి ఇద్దరు ఫైనల్ చేరనున్నారు.