Breaking News

ఇజ్రాయిల్, హమాస్ దాడులు ఎక్కడికి దారి తీస్తున్నాయంటే ? 

Add a heading 49 ఇజ్రాయిల్, హమాస్ దాడులు ఎక్కడికి దారి తీస్తున్నాయంటే ? 

ఇజ్రాయెల్‌, హమాస్‌ ఘర్షణ మొదలయ్యాక ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌కు నడిపే విమానాలను ఎయిరిండియా రద్దుచేసింది. అయితే ఆ రద్దును నవంబరు 2వ తేదీ వరకూ పొడిగించినట్టు వెల్లడించింది. అసలు ఇజ్రాయెల్‌, హమాస్‌ ఘర్షణ లో ఏయే దేశాలు ఎవరికీ మద్దతు పలుకుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత్ కు ఇజ్రాయిల్ ఏమని విజ్ఞప్తి చేస్తోంది. తుర్కియే అధ్యక్షుడు హమాస్ కు ఎందుకు మద్దతిచ్చాడు, చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం పై ఏమంటున్నారు అనే విషయాలను ఒక్కసారి చూద్దాం. 

                    హమాస్‌ దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్‌ భీకర వైమానిక దాడులు చేస్తోంది. మిలిటెంట్లే లక్ష్యంగా సాగుతున్న ఈ దాడుల్లో సామాన్యులతోపాటు 2,360 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారనే వార్తలు వేలు వడ్డాయి. అయితే చిన్నారుల మరణాలు మనస్సాక్షిపై మచ్చేనని యునిసెఫ్ వ్యాఖ్యానించింది. ఇక్కడ ఒక చిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తున్న వేళ గాజాలో ఓ తల్లి ఒంటిమీద గాయాలతో కొనప్రాణంతో ఆసుపత్రికి వచ్చింది. గర్భంలోనే కన్ను మూయాల్సిన శిశువును వైద్యులు కాపాడారు. అత్యవసర శాస్త్ర చికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. కానీ తల్లి మాత్రం తుదిశ్వాస విడిచింది.  

                       ఇజ్రాయెల్‌ ఇంకా హమాస్‌ మధ్య పోరు కొనసాగుతున్న వేళ ప్రపంచంలోని ఒక్కో దేశం తమ వైఖరిని వెల్లడిచేస్తున్నాయి. తాము ఎవరికీ మద్దతు తెలుపుతున్నారా అనే విషయాన్నీ తేటతెల్లం చేస్తున్నాయి. ప్రస్తుతం తుర్కీయే దేశం తన మనసులో మాట బయటపెట్టింది. తాము హమాస్‌కు అనుకూలంగా ఉన్నామని చెప్పేసింది. హమాస్ చేస్తోంది ఉగ్రదాడి కాదని తన మాతృభూమిని, ప్రజలను కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నమని పేర్కొంది. ఈక్రమంలోనే తుర్కియే అధ్యక్షుడు రెసిప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ తన ఇజ్రాయెల్‌ పర్యటనను రద్దు చేసుకున్నట్లు వెల్లడించాడు. 

                         హమాస్‌ను తీవ్రవాద సంస్థగా ఇప్పటికే పలు దేశాలు గుర్తించాయని భారత్ కూడా అలానే హమాస్ ను గుర్తించాలని ఇజ్రాయెల్‌ విజ్ఞప్తి చేస్తోంది. ఇజ్రాయెల్‌పై కిరాతక చర్యకు పాల్పడిన హమాస్‌కు సంబంధించిన వివరాలను తమ దేశం ఇప్పటికే భారత అధికారులకు అందించిందని వారు చెబుతున్నారు. హమాస్‌ తీవ్రవాద దాడులను ప్రధాని మోదీ ఖండించారని కూడా వారు గుర్తుచేశారు.  ప్రపంచంలో భారత దేశం ఒక్క నిర్ణయానికి ప్రాముఖ్యత ఉందని కూడా చెబుతోంది. 

                                ఇక భారత్ కూడా ఇజ్రాయెల్‌, హమాస్‌ ఘర్షణ కారణంగా తలెత్తిన పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హింసను వీడి శాంతి స్థాపనకు ఇరు పక్షాలు ముందుకు రావాలని  ఐరాస భద్రతా మండలిలో నిర్వహించిన సదస్సులో కోరింది. అనేకమంది ప్రజల మరణాలతోపాటు మానవతా సంక్షోభం తలెత్తడం ఆందోళన కలిగించే విషయమని భారత్ తెలిపింది. అయితే పాకిస్తాన్ మాత్రం ఇక్కడ కూడా కాశ్మిర్ విషయాన్నీ ప్రస్తావించి మరో మారు తన కుబుద్ధిని బయటపెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *