
ఈ విషయం తెలిస్తే ఆ తలుపులు తీసి పడేస్తారు కొంత మంది ఇళ్లలో తలుపులు తెరిచేటప్పుడు అలానే మూసేటప్పుడు శబ్దం చేస్తాయి. కిటికీలు కూడా మోస్తున్న సమయంలో కిర్రు మనే శబ్దం వస్తుంది. లేదంటే తలుపు కుంగి, ఇంటి నేలను రుద్దుకుంటూ ఉంటుంది. కానీ మనం వాటిని అస్సలు పట్టించుకోము. అయితే ఇప్పుడు చెప్పే విషయం గనుక మీరు వింటే అటువంటి తలుపులను వెంటనే మార్చేస్తారు. అదేమిటంటే ఇంటి తలుపులు వేస్తున్నప్పుడు శబ్దం చేయడం వల్ల ధన నష్టం కలుగుతుందని అంటున్నారు వాస్తు శాస్త్రజ్ఞులు, కేవలం ధన నష్టమే కాదు, మన ఇంటికి ఇలాంటి తలుపులు ఉంటె ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం కూడా ఉందట.