Breaking News

ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్, ఎయిర్ ఫైబర్ వల్ల ఇన్ని ఉపయోగాలా ?

Add a heading 33 ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్, ఎయిర్ ఫైబర్ వల్ల ఇన్ని ఉపయోగాలా ?

భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ ఓ కొత్త ఒరవడికి నాంది పలికింది. ఇటీవలే ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో Airtel ఎక్స్ ట్రీమ్, ఎయిర్ ఫైబర్ సర్వీసును ప్రారంభించింది.

ప్రస్తుతం ఈ రెండు మహానగరాలకు మాత్రమే పరిమితం అయిన ఈ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ఎక్స్ ట్రీమ్, ఎయిర్ ఫైబర్ అనేది ఎయిర్‌టెల్ 5G ప్లస్ నెట్ వర్క్ లో వైర్ లెస్‌గా పని చేసే ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ సొల్యూషన్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు.

ఈ నెట్ వర్క్ సాయంతో మారుమూల గ్రామాలకు సైతం ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనేదే ప్రధమ ఉద్దేశ్యం అని, అందుకే ఈ టెక్నాలజీ 5G వైర్‌లెస్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది.

ఇక ఈ ఎయిర్‌టెల్ ఎక్స్ ట్రీమ్, ఎయిర్ ఫైబర్ అనేది వైర్ లెస్ కనెక్టివిటీని అందించడానికి Wi-Fi 6 టెక్నాలజీని ఉపయోగిస్తుందని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *