
మనం గమనిస్తే కొంత మంది ఇంటి పై కప్పు మీద పాత వస్తువులు, తుప్పు పట్టిన ఇనుప సమన్లు మనకు దర్శనమిస్తాయి. అయితే అది ఎంత మాత్రమూ మంచిది కాదంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు, ఇలా చేయడం వల్ల పితృ దోషంతో పాటు ఇంటి సభ్యులపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అందుకే ఇంటి పైకప్పును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలట. ఇకనైనా మీ ఇంటి మీద ఉన్న పాత వస్తువులను తీసేసి శుభ్రం చేసుకోండి. కేవలం ఇది వాస్తు శాస్త్రాన్ని బట్టి మాత్రమే కాదు, శుభ్రతను కూడా దృష్టిలో పెట్టుకుని మనం దానిని అలవర్చుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఇంటి మీద పాత వస్తువులు ఉంచడం వల్ల వాటి కిందకు విష కీటకాలు చేరడం, పాములు తేళ్లు వంటివి ఆవాసాన్ని ఏర్పరుచుకోవడం జరుగుతుంది. కాబట్టి వాటిని ఇంటిమీద నుండి తీసేసి మరో చోట ఉంచడం ఉత్తమం అని సూచిస్తున్నారు పెద్దలు.