
ఇటీవల యాపిల్ కంపెనీ విడుదల చేసిన ఐఫోన్ 15 సిరీస్ తాలూకు స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఐఫోన్ 15 హవా సద్దుమణగకముందే టెక్ ఫ్రీక్స్ ఐఫోన్ 16 కోసం ఎదురు చూడటం మొదలు పెట్టారు. వీరి నిరీక్షణకు తగ్గట్టే, ఐఫోన్ 16 ఫీచర్లు ఇవే అంటూ మార్కెట్లో కొన్ని లీకులు చక్కర్లు కొడుతున్నాయి.
మరి కధా కమామిషు ఏమిటో ఒక్కసారి చూద్దాం. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ని అప్‌గ్రేడ్ చేసి మార్కెట్‌లో విడుదల చేయనున్నారట. ముఖ్యంగా స్టాండర్డ్ ఐఫోన్ 16 మోడల్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120 హెచ్‌జెడ్‌గా ఉంది.
ఇప్పటి వరకు అన్నీ ఐఫోన్‌లలోని రిఫ్రెష్ రేటు 60 ఉంటె, దీనిపై వినియోగదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఐఫోన్ 16లో రిఫ్రెష్ రేటుని 120 హెచ్‌జెడ్‌కి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ 2 బూస్ట్ చేసిన A17 ప్రో చిప్‌సెట్, 8GB RAM ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఐఫోన్ 16 ప్రో 6.3 అంగుళాలతో లార్జ్ డిస్‌ప్లే.. అదే సిరీస్‌లోని ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9 అంగుళాల స్క్రీన్ ఉండే అవకాశం ఉందట.