Breaking News

చంద్రబాబుకి బెయిల్ ఎందుకొచ్చింది..? 

naidu kErC చంద్రబాబుకి బెయిల్ ఎందుకొచ్చింది..? 

మాజీ ముఖ్య మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి బెయిల్ మంజూరు అయింది. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికి నిమిషాల వ్యవధిలో తెలిసిపోయింది.

దాదాపు 53 రోజుల నిర్బంధం తరువాత తమ నాయకుడు బయటకు రావడంతో ఆపార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాయి. నిర్బంధం వీడిన నిండు చంద్రుడు అంటూ సంతోషంతో ఉప్పొంగి పోయారు. అయితే అసలు చంద్రబాబుకి బెయిల్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయాలు ఒక్కసారి చూద్దాం. 

నారా చంద్రబాబు నాయుడుని సిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన నాడు వైసీపీ మంత్రులు కొందరు సంబరాలు చేసుకున్నారు. బాబు చేసిన అవినీతి బట్టబయలు అయిందని, ఆయన బయటకు రావడం కల్ల అంటూ జోస్యం కూడా చెప్పారు.

అందుకు తగ్గట్టు గానే ఆయనకు పలుమార్లు ఏసీబీ కోర్ట్ తోపాటు హై కోర్ట్ లో కూడా చుక్కెదురైంది. కానీ ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయింది. ఇన్ని రోజుల పాటు రాని బెయిల్ ఇప్పుడెలా వచ్చింది అని సామాన్యుల మదిలో మెదులుతున్న సందేహం. 

IMG Chandrababu 2 1 3RBU73SO చంద్రబాబుకి బెయిల్ ఎందుకొచ్చింది..? 

చంద్రబాబును రిమాండ్ ఖైదీ గా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించిన నాటి నుండి ప్రతి ఒక్కరు చెబుతున్న మాట 73 ఏళ్ళ వయసున్న సీనియర్ నాయకుడిని కక్షపూరితంగా వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది అని. ఇక రిమాండ్ కి తరలించిన నాటి నుండి బాబు ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది, చంద్రబాబు బరువు 72 కేజీల నుండి 66 కేజీలకి వచ్చింది. దీనితోపాటు అయనకు చర్మ సంబంధిత సమస్య కూడా ఉండడం, అది ఇప్పుడు జైలు వాతావరణానికి తీవ్ర తరం కావడం కూడా మరో కారణం. దాని వల్ల అయన మెడ మీది నుండి నడుము వరకు దద్దుర్లు వచ్చేలా చేసింది. అన్నిటికి మించి చంద్రబాబుకి ఇప్పటికే ఒక కంటికి ఆపరేషన్ చేశారు. మరో కంటికి కూడా ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వ వైద్యులు స్వయంగా ధ్రువీకరించారు. 

ఈ విషయంలో కూడా కొంత గందరగోళం నెలకొంది, మొదట చంద్రబాబు కంటికి ఆపరేషన్ వీలైనంత త్వరగా చేయించాలని నివేదిక ఇచ్చిన డాక్టర్లు, మరో నివేదిక కూడా ఇచ్చారు, ఆపరేషన్ అంత అర్జెంట్ ఏమి కాదని కొంత సమయం తీసుకోవచ్చు అన్నట్టు అందులో పేర్కొన్నారు అని టీడీపీ శ్రేణులు తెలిపాయి.

ఇదంతా బాబును ఎక్కువ కాలం నిర్బంధించాలనే కుట్ర అని భగ్గు మన్నాయి. ఏది ఏమైనా  హై కోర్ట్ న్యాయ మూర్తి చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేశారు. ఆయనకు 4 వరాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఈ నాలుగు వారాల్లో ఆయన సొంత ఖర్చులతో వైద్య పరీక్షలు చేయించుకోవాలని, కంటికి కూడా చికిత్స చేయించుకోవాలని సూచించారు. అయితే నాలుగు వారాల గడువు ముగిసిన అనంతరం చంద్రబాబు స్వయంగా వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *