Breaking News

చై మొదటి వెబ్ సీరీస్ విశేషాలు మీరు కూడా చూసేయండి

Add a heading 27 చై మొదటి వెబ్ సీరీస్ విశేషాలు మీరు కూడా చూసేయండి

అక్కినేని వారి నట వారసుడు అక్కినేని నాగసైతన్య వరుస సినిమాలతో క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళుతున్నారు. కేవలం సినిమాలతో మాత్రమే కాక వెబ్ సీరీస్ తో కూడా ప్రేక్షుకులను అలరించాలని డిసైడ్ అయ్యాడు చై. అందుకే తనతో మనం, థాంక్యూ వంటి సినిమాలు చేసిన విక్రమ్ కె కుమార్ తో ఈ వెబ్ సీరీస్ చేశాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ వెబ్ సీరీస్ ను రూపొందిస్తోంది.

ఒక విశేషం ఏమిటంటే దూత పేరుతొ వస్తున్న ఈ వెబ్ సీరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారికి మొట్టమొదటి వెబ్ సీరీస్ కాగా, నాగ ఛైతన్యకు ఇది తొట్ట తొలి వెబ్ సీరీస్. ఈ సిరీస్‌ను ప్రకటించినప్పటినుండి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వలేదు. ఒకానొక మీడియా సమావేశంలో చై ని దూత గురించి అడగ్గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఎందుకు ఆలస్యం చేస్తుందో తనకు తెలీదని చెప్పాడు.

షూటింగ్ పార్ట్ ఎప్పుడో కంప్లీట్ చేశామని అన్నాడు. మొత్తానికి ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనట్టు కనిపిస్తోంది. డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో ‘దూత’ స్ట్రీమింగ్ కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉండగా ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో ఉందట.

ఇది ఇలా ఉంటె చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి పల్లవి నాయిక గా ఎంపికైంది.

దేవర లో జాన్వీ గెటప్ చుస్తే సర్ప్రైజ్ అవుతారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *