
అమెరికా మాజీ అధ్యక్షుడు, ఇతని మాటలు హావభావాలు ఎప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటాయి. అధ్యక్షుడుగా ఉన్న సమయంలో కూడా ఆయన తనకే సాధ్యమయ్యే పదునైన మాటలను ఉపయోగించి ఎదుటివారి నోటికి తాళం వేయగలిగేవారు. అయితే ఏ దురుసు తనం ఆయనను ప్రజల నోళ్ళలో నానేలా చేసిందో అదే దురుసుతనం ఆయనకు కొన్ని ఇబ్బందులు కూడా తెచ్చి పెడుతోంది. తాజాగా ఆయనకు కోర్టు జరిమానా కూడా విధించింది. కోర్టు విధించిన జరిమానా ఆయనకు పెద్ద లెక్కలోకి రాకపోయినా జరిమానా పడింది అనే మాట మాత్రం మిగిలిపోయింది.
ఇక అసలు విషయంలోకి వెళితే, డోనాల్డ్ ట్రంప్ న్యాయస్థానం వెలుపల కోర్టు సిబ్బందిపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఆ కారణంగానే జరిమానా వేస్తున్నట్లు న్యాయమూర్తి ఆర్థర్ ఎన్‌గోరాన్ వెల్లడించారట. అయితే న్యాయ మూర్తి వర్కింగ్ ఇవ్వకుండా ఒక్కసారిగా చర్యలు తీసుకోలేదట. అంతకు ముందు కొన్ని వారాల క్రితమే కోర్టు సిబ్బందిపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. కానీ ట్రంప్ మాత్రం కోర్ట్ ఉత్తర్వులను ఉత్త మాటలుగానే పరిగణించి, యధాతధంగా తన నోటికి నాలుకకు పనిచెప్పారు. దీంతో న్యాయమూర్తి 10 వేల డాలర్ల ఫైన్ వేశారు. కానీ ట్రంప్ కి ఇది కొత్తేమి కాదు, ఇంతకు పూర్వం కూడా ఇలా నోరు పారేసుకున్నందుకు 5 వేల రూపాయల జరిమానా కట్టారు. అయితే ట్రంప్ తరుపు న్యాయవాది మాటలు మాత్రం మరోలా ఉన్నాయి, ట్రంప్ కోర్ట్ సిబ్బందిపై ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, ఆయన సాక్షిని ఉద్దేశించి మాత్రమే ఆలా అన్నారని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు.