
సీతారామం సినిమాలో సీత పాత్రను పోషించి తెలుగువారిని బాగా ఆకట్టుకున్న నటి మృణాల్ ఠాకూర్. ఈ మరాఠీ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు సినిమాలతో తెగ సందడి చేస్తోంది. పైగా తెలుగు ప్రేక్షకుల సంగతి ప్రత్యేకంగా చెప్పాలా ఒక్కసారి గనుక నచ్చేస్తే గుండెల్లో పెట్టుకుంటారు.
మరి తెలుగువారి పల్స్ పెట్టుకుందో ఏమో కానీ మృణాల్ కూడా తెలుగు లో నాని, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల సినిమాలను వరుసగా ఒప్పుకుంది. నాని సినిమా సిసెంబర్ లో విడుదల కానుండగా విజయ్ సినిమా సంక్రాంతికి రానుంది. ప్రస్తుతం నాని మృణాల్ కాంబినేషన్ లో వస్తున్న హాయ్ నాన్న కోసం వీరిద్దరూ ఒక ప్రమోషనల్ వీడియో చేశారు. ఈ వీడియోలో నెటిజన్లు వేసే ప్రశ్నలను నాని, మృణాల్ ను అడిగాడు, అదే విధంగా నానికి మృణాల్ కూడా కొన్ని ప్రశ్నలు సంధించింది.
ఇక నాని అడిగిన ప్రశ్న ద్వారానే మృణాల్ కూడా డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయింది అన్న విషయం బయటకు వచ్చింది. నటనపై ఆమెకు మక్కువ ఉండటంతోనే డెంటిస్ట్ కోర్స్ లో చేరాక కూడా ఆడిషన్స్ కు వెళ్లేదాన్ని అని చెప్పింది. కానీ తన మొదటి ఆడిషన్ లోనే సెలెక్ట్ ఐపియి యాక్టర్ అయిపోయాను అని పేర్కొంది.