
jr.ఎన్టీఆర్ కొరటాల శివ కంబినేషన్ లో రూపొందిన జనతా గారేజ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ హిట్ కాంబినేషన్ ను మరో సారి రిపీట్ చేస్తున్నారు. వీరిద్దరి కలయికలో దేవర అనే సినిమా తెరకెక్కుతోంది. అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను తారక్ సోదరుడు కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయదలచిన మేకర్స్ అందుకు తగ్గట్టుగానే క్యాస్టింగ్ ను సెట్ చేసుకున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ను ప్రతినాయకుడిగా ఎంపిక చేశారు. పైగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా బుక్ చేశారు. బుక్ చేయడమే కాదు ఆమె పై సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమాలో జాన్వీ పేరు తంగం. లంగా వోణిలో పల్లెటూరి పిల్లలా కనిపిస్తున్న ఆమె ఫోటోను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రతుతం ఈ చిత్ర షూటింగ్ గోవాలో జరుగుతుండగా తారక్ కూడా బాగ్ సర్దుకుని గోవా వెళ్లారు.