
మనం కొంత మంది ఇళ్లు చూస్తూ ఉంటాం, వారి ఇంటి పైన ఉండే వాటారు ట్యాంక్ లీకేజ్ అవుతూ ఉంటుంది. అయితే అది ఎంత మాత్రం మంచిది కాదు అంటారు వాస్తు నిపుణులు. ఇంటి వాటర్ ట్యాంక్ లో నుండి చుక్క నీరు లీకైనా మన ఇంటి సొమ్ము వృధా అయిపోయే సూచన ఎక్కువగా కనిపిస్తుందట. ఇది మాత్రమే కాదు మన ఇంట్లో కుళాయి, అంటే నీటి ట్యాప్ నుండి నీరు చుక్కలు చుక్కలుగా పోవడం కూడా శుభ సూచకం కాదంటున్నారు. ఆలా జరగడం కూడా ధన నష్టానికి సంకేతమే అంటున్నారు. ఇక మన ఇంట్లో మనం వాడుకోగా వృధాగా పోయే నీరు కూడా ఎటు వైపు నుండి పడితే అటువైపు నుండి పోకూడదట, ఆ నీరు ఇంటికి దక్షిణం లేదంటే పడమర వైపు పారేలా చూడాలట. ఆలా చేయడం వల్ల ధన నష్టాన్ని నియంత్రించుకునే వీలుంటుందని శాస్త్రం చెబుతోందట.