
వాట్సాప్ లో ఇప్పటివరకు.. ఒక్కసారి మాత్రమే చూడగలిగే ఫోటోలను మనం పంపే వీలుంది, ఆ ఫోటో ను ఒక్కసారి చూశాక మరోమారు చూడడానికి వీలుండదు, పైగా వాటిని స్క్రీన్ షాట్ కూడా తీయలేము.
అయితే ఇప్పుడు ఈ మెసేజింగ్ యాప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. అదేమిటంటే మనం ఇంతకు ముందు వాయిస్ మెసేజ్ పంపితే దానిని మనమే డిలీట్ చేయాలి లేదంటే ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వారు మాత్రమే డిలీట్ చేసే వీలు ఉండేది, కానీ ఇప్పుడు వన్ టైం వాయిస్ అందుబాటులోకి వచ్చేసింది.
ఈ తరహా వాయిస్ మెసేజ్ ను ఒక్కసారి గనుక ఓపెన్ చేసి వింటే అది ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. దానిని మరోమారు వినడానికి వీలుండదు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ బీటాలో బీటా టెస్టర్‌లను, టెస్ట్ ఫ్లైట్ యాప్ ద్వారా iOS కోసం వాట్సాప్ బీటాను ఎంచుకోవడానికి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.
ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమంది బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో అందరి యూజర్లకు అందుబాటులోకి రానుంది.