
వైఫై వాడకం గురించి మాట్లాడాలంటే కరోనా ముందు కరోనా తరువాత అన్నారు చెప్పుకోవాలి. ఒకప్పుడు ఆఫీస్ వర్క్ మొత్తం ఆఫీస్ లోనే చేసుకుని ఇంటికి వచ్చాక తీరికగా సెల్ ఫోన్ లో మొబైల్ డేటా తో ఇంటర్ నెట్ వాడే వాళ్ళం.
అయితే కరోనా కారణంగా వర్క్ ఫర్మ్ హోమ్ రావడంతో పిల్లలు చదువు నుండి మన ఆఫీస్ వర్క్ వరకు అన్నిటికి మనకు వైఫై తప్పనిసరి అవుతోంది. అయితే దీనిని ఎల్లప్పుడు ఆన్ లో ఉంచడం మంచిదా ? చెడ్డదా ?

అంటే చెడే ఎక్కువ అంటున్నారు నిపుణులు. Wi-Fi రూటర్‌ని ఇన్‌స్టాల్ చేసిన ప్రదేశంలో నిద్రిస్తున్న వ్యక్తి నిద్రలేమితో బాధపడవచ్చు. ఈ నిద్రలేమి సమస్య భవిష్యత్తులో మరింత అధికం కావచ్చు అంటున్నారు నిపుణులు.
వైఫై రూటర్ వల్ల శరీరంలో అలసట, మైగ్రేన్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందట. కాబట్టి దీన్ని నిర్ణీత వ్యవధిలో మాత్రమే ఉపయోగించుకోవాలని, పని ముగిసిన వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలని సూచిస్తున్నారు.