
సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం Samsung S24 సిరీస్‌ను వచ్చే ఏడాది జనవరి 2024లో ప్రారంభించే అవకాశం ఉంది. ప్రతి ఏడాది ఈ కంపెనీ అత్యంత ప్రీమియం S సిరీస్‌ని ఫిబ్రవరి మాసంలో విడుదల చేస్తూ వస్తోంది. తాజా నివేదిక ప్రకారం శామ్‌సంగ్ సంస్థ శాంసంగ్ గాలక్సీ S 24 అల్ట్రాలో ఐ ఫోన్ 15 ప్రో వంటి టైటానియం ఫ్రేమ్‌ను అందించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ లో స్టాండర్డ్, ప్లస్, అల్ట్రా వేరియంట్లు ఉంటాయని విశ్వసనీయ సమాచారం. ఇవన్నీ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గెలాక్సీ ఎస్23 మోడల్ కు దగ్గరగా ఉంటాయని తెలుస్తోంది.
ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్ లో 8జీబీ ర్యామ్ అందుబాటులోకి వస్తోందట. ఇక ఎస్23 అల్ట్రాలో 12జీబీ ర్యామ్ ఉంటుందని చెబుతున్నారు.
ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫొటోగ్రఫీ కెమెరా సిస్టమ్‌తో రానున్నట్లు సమాచారం అందుతోంది.