collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / ఏపీలో 10 ఫలితాలకు బ్రేక్.. వాయిదాకు కారణం ఇదేనా? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News...

ఏపీలో 10 ఫలితాలకు బ్రేక్.. వాయిదాకు కారణం ఇదేనా?

2022-06-04  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

students-2


పదవ తరగతి ఫలితాలు వస్తాయని ఆశగా ఎదురుచూసిన విద్యార్థులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు.. కానీ అధికారులలో చోటు చేసుకున్న గందరగోళం కారణంగా ఫలితాలను సోమవారానికి వాయిదా వేయడంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. విద్యాశాఖ అధికారులు కొద్ది రోజుల క్రితమే పదవ తరగతి ఫలితాలకు సంబంధించి సమాచారం విడుదల చేశారు. వారు అందించిన సమాచారం ప్రకారం శనివారం ఉదయం 11 గంటలకు పదవ తరగతి ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. ఫలితాలను తెలుసుకునేందుకు విద్యార్థులు 10 గంటల సమయానికి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ వద్దకు చేరుకున్నారు. మీడియా కూడా మీడియా పాయింట్ వద్దకు చేరుకుంది. కానీ విద్యాశాఖ అధికారులు ఫలితాలను ప్రకటించకుండా, వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆరు లక్షల 22వేల మంది  పదవతరగతి పరీక్షలు రాశారు. వీరంతా ప్రస్తుతం ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే విద్యాశాఖ అధికారులు ఉన్నట్టుండి విద్యార్థులను వారి తల్లిదండ్రులను షాక్ కు  గురిచేయడంతో వారి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లనే పరీక్షలు వాయిదా వేయాల్సి వచ్చిందని, తప్పనిసరిగా సోమవారం ఫలితాలు విడుదల అవుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. అయితే సోమవారం ఏ సమయానికి ఫలితాలను విడుదల చేస్తారో అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.

పరీక్షలు సైతం..    

పదవ తరగతి పరీక్షల విషయంలో కూడా ప్రతి ఏటా ఇదే తరహా గందరగోళం కొనసాగుతోంది. గత ఏడాది పదవతరగతి పరీక్షలు అనుకున్న సమయానికి నిర్వహించకుండా ప్రభుత్వం కొద్ది రోజులు వాయిదా వేసింది. ఈ విడత కూడా మే 2న నిర్వహించాల్సిన పరీక్షలు 9వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పుడు ఫలితాల విషయంలో కూడా ఇలాంటి గందరగోళమే చోటు చేసుకోవడానికి కారణం ఏమిటన్న దానిపై స్పష్టత లేదు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వడానికి కూడా విద్యాశాఖ అధికారులు తీవ్ర జాప్యాన్ని కనబరిచారు . ఇతర వ్యక్తుల ద్వారా మాత్రమే పరీక్షలు వాయిదా పడినట్లు ముందుగానే తేలిపోయింది. తర్వాత అధికారులు దీనిని ధ్రువీకరించడం మాత్రమే మిగిలింది. ఎంతో కష్టపడి పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు ఎప్పుడు వస్తాయి అని ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఉన్నట్టుండి వాయిదా పడడం విమర్శలకు దారి తీస్తోంది. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. అధికారులు ఇప్పటికైనా పరీక్షల విషయంలో తగిన స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు.

బొత్స ఆగ్రహం..    

పదవ తరగతి పరీక్ష ఫలితాలను వాయిదా వేసే విషయం మీద కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని భూతద్దంలో చూపడం పై  మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేవలం రెండు రోజుల పరీక్ష వాయిదా వేసినంత మాత్రాన ఈ విషయంపై ఏదో ఘోరం జరిగి పోయినట్లుగా వ్యవహరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పరీక్ష ఫలితాల విషయంలో జరిగిన జాప్యంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. దీనికి కారణం ఏమిటో చెప్పాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పదవ తరగతి పరీక్ష ఫలితాలు ఉన్నట్టుండి వాయిదా పడడం పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా దీనిపై విమర్శల బాణాలు సంధిస్తున్నాయి. వైసీపీ మంత్రులు మాత్రం దీనిని చాలా చిన్న విషయంగా కొట్టిపారేయడం విశేషం.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి    
 



2022-06-04  News Desk