ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 134 వ జయంతి సందర్భంగా భారతీయ గణిత దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు. తునిలో విద్యార్థులు గణితశాస్త్రంలో వివిధ రకాల ప్రాజెక్టులను తయారుచేసి, ప్రదర్శించారు. అంతే కాకుండా విద్యార్థులు రామానుజన్ రూపాన్ని అతి పెద్ద రంగోలిగా ప్రదర్శించి ఆంగ్లం లో HAPPY BIRTHDAY అనే అక్షరాలు రాసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గణితోపన్యాసకురాలు యం. మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిత్య జీవితంలో గణిత శాస్త్రం విశిష్టత ను వివరించారు. నేటి పోటీ ప్రపంచంలో గణితం నేర్చుకునే వివిధ మెళకువల గురించి, పోటీ పరీక్షలలో మెళకువల గురించి విద్యార్దులకు వివరించారు. పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు.