6tvnews

Header - Ramky
collapse
...
Home / బిజినెస్ / రిటైల్ / మాల్ట్ ఫ్లేవర్డ్ ఫ్రూట్ డ్రింక్ లకు పెరుగుతున్న ఆదరణ

మాల్ట్ ఫ్లేవర్డ్ ఫ్రూట్ డ్రింక్ లకు పెరుగుతున్న ఆదరణ

2021-10-30  Business Desk
venus

deepika
 

 

‘బి బోల్డ్, బి బ్రేవ్’ అనేది పార్లే ఆగ్రో  ఉల్లాసభరిత మాల్ట్ ఫ్లేవర్డ్ ఫ్రూట్ డ్రింక్ బి ఫిజ్ నినాదం. ఇప్పుడు ఈ పానీయం బ్రాండ్ విస్తరణపథంలో సాగుతోంది. బి ఫిజ్ తన నూతన యాడ్ క్యాంపెయిన్ తో బేవరేజ్ విభాగంలో  మరో సారి సంచలనం కలిగించింది. ఈ బ్రాండ్ నూతన ప్రచారకర్తగా అర్జున్ కపూర్ కనిపిస్తారు.  


గత ఏడాది మహమ్మారి ఉన్న కాలంలోనే బిఫిజ్  మార్కెట్లోకి వచ్చింది. ఇది పార్లే ఆగ్రో స్పార్క్లింగ్ ఫ్రూట్ డ్రింక్ విభాగానికి ఓ సరికొత్త జోడింపు. ఇది అసాధారణ విజయం సాధించింది. సెకండరీ డేటా అధ్యయనం కింద,  పెరిగిపోతున్న డిమాండ్ ప్రకారం, ఏడాది కాలంలోనే బి ఫిజ్ ఒక్కటే మాల్ట్ ఫ్లేవర్డ్ ఫ్రూట్ డ్రింక్ విభాగం వృద్ధిని 10 రెట్లు చేయనుంది. అంతేగాకుండా, తన విశిష్ట రుచితో ఇది ఈ విభాగంలో సంచలనం సృష్టించింది. 160  మి.లీ. ధర రూ.10. పార్లే ఆగ్రో ఒక ఏడాదిలో సుమారుగా అర బిలియన్ యూనిట్లను విక్రయించింది. అంతేగాకుండా భారతదేశంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న మాల్ట్ ఫ్లేవర్డ్ ఫ్రూట్ డ్రింక్ గా నిలిచింది. 


ఈ సందర్భంగా పార్లే ఆగ్రో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఎంఓ నాడియా చౌహాన్ మాట్లాడుతూ, ‘‘గత ఏడాది కాలంలో బి ఫిజ్ ఎంతో వృద్ధి చెందింది. మా విక్రయాలను అనేక రెట్లు పెంచింది. ఇది స్పార్క్లింగ్ ఫ్రూట్ డ్రింక్  విభా గాన్ని విస్తరించడం మాత్రమే గాకుండా, మాల్ట్ ఫ్లేవర్డ్ ఫ్రూట్ డ్రింక్ విభాగాన్ని అనేక రెట్లు పెంచింది. ఈ విభాగం భారత్ లో దాదాపుగా లేదనే చెప్పవచ్చు. మహమ్మారి కాలంలోనూ పోర్ట్ ఫోలియోను విజయవంతంగా  విస్తరిం చడం అనేది మా ఆకాంక్షలకు, అంకితభావానికి నిదర్శనం. బి ఫిజ్ తో మేం మాల్ట్ ఫ్లేవర్డ్ ఫ్రూట్ డ్రింక్ విభాగాన్ని నిర్మించాలనుకుంటున్నాం. అది మాత్రమే గాకుండా, 2030 నాటికి యాప్పీ ఫిజ్, బి ఫిజ్ సమ్మేళన  శక్తితో స్పార్క్లింగ్ ఫ్రూట్ డ్రింక్ విభాగాన్ని 10,000 కోట్ల విభాగంగా చేద్దామని కూడా భావిస్తున్నాం’’ అని అన్నారు. 


బి ఫిజ్ అనేది ధైర్యానికి సంబంధించిన డైనమిక్ డ్రింక్ గా చిత్రీకరించబడింది. నూతన అనుభూతులను, సవాళ్ళను కోరుకునే వారి కోసం ఉద్దేశించిందిగా రూపుదిద్దుకుంది. ఈ పానీయం  ఆకర్షణీయంగా ఎరుపు, తెలుపు రంగు ప్యాకేజింగ్ తో ఉంటుంది 


అర్జున్ కపూర్ ను ప్రచారకర్తగా నియమించడంపై నాడియా చౌహాన్ మాట్లాడుతూ, ‘‘‘ధైర్యం’, ‘ప్రత్యేకత’ లకు ప్రాతి నిథ్యం వహించేందుకు అర్జున్ కపూర్ చక్కటి ఎంపిక. ఈ బ్రాండ్ కు ప్రచారకర్తగా ఆయన మాతో ప్రయాణం చేయడం మాకెంతో ఆనందదాయకం. అర్జున్ వ్యక్తిత్వానికి తగినట్లుగానే, బి ఫిజ్ కూడా ఇతరులతో పోల్చేందుకు వీల్లేని పటిష్ఠమైన విలక్షణ గుణాన్ని కలిగిఉంది. ఈ జంట ఈ బ్రాండ్ కు గొప్ప విజిబిలిటీని నిర్మిస్తారని, భారతదేశవ్యా ప్తంగా పానీయాల వినియోగదారులకు సులభమైన ఎంపికగా చేస్తారని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు. 


పార్లే ఆగ్రోతో అనుబంధం గురించి  నటుడు అర్జున్ కపూర్ మాట్లాడుతూ, ‘‘ఒక విశిష్టమైన, ధైర్యవంతమైన, విప్లవాత్మకమైన బి ఫిజ్ లాంటి పానీయానికి ప్రతినిథ్యం వహించడం నాకెంతో సంతోషాన్ని అందిస్తోంది. బ్రాండ్ ఆశ యాలు, మీ సొంత వ్యక్తిత్వం పరిపూర్ణంగా మమేకమయ్యే సందర్భాలు కొన్ని ఉంటాయి. బి ఫిజ్ తో నా అనుబంధం అలాంటిదే. ఈ ప్రకటన కోసం చేసిన షూటింగ్ ఒక గొప్ప అనుభూతిని అందించింది. అడ్వర్టయిజింగ్ పట్ల ఈ బ్రాండ్ అనుసరించిన ధోరణి అలాంటిది. బ్రాండ్ పట్ల పార్లే ఆగ్రో కు గల ఆశయంతో నేను పాలుపంచు  కోవడం ఆనందంగా ఉంది. వారి వృద్ధి ప్రయాణంలో భాగమవుతూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. 


2021-10-30  Business Desk

rajapush