6tvnews

Header - Ramky
collapse
...
Home / బిజినెస్ / రిటైల్ / రిలయన్స్ రిటైల్ తో డిఎంఐ ఫైనాన్స్ భాగస్వామ్యం

రిలయన్స్ రిటైల్ తో డిఎంఐ ఫైనాన్స్ భాగస్వామ్యం

2021-11-01  Business Desk
venus

Reliance retail
 

డిఎంఐ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (డిఎంఐ”) భారతదేశం అంతటా రిలయన్స్ రిటైల్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వినియోదాదారులకు డిజిటల్ ఫైనాన్స్ సౌకర్యాలను అందించడానికి మొట్టమొదటిసారిగా రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

భారతదేశంలోని అన్ని రిలయన్స్ రిటైల్ అవుట్ లెట్లలోని ఎలక్ట్రానిక్ వినియోగదారులకు పూర్తిగా కాగిత రహిత డిజిటల్ పధ్ధతి ద్వారా డిఎంఐ ఫైనాన్సింగ్ సేవలను అందిస్తుంది. రిలయన్స్ ద్వారా కొత్తగా ప్రారంభించబడిన జియో ఫోన్ నెక్స్ట్ రుణాలతో ఈ భాగస్వామ్యం ప్రారంభమవుతుంది.

ఈ సరికొత్త భాగస్వామ్యం రిలయన్స్ రిటైల్ కస్టమర్లందరికీ ఎలాంటి పేపర్ డాక్యుమెంటేషన్ లేకుండానే తక్షణ రుణాల్ని అందించడమే కాకుండాసౌకర్యవంతమైన ఇఎంఐ ఎంపికలను అందిస్తుంది. జియో ఫోన్ నెక్స్ట్ కోసం లోన్ కాలపరిమితి 18, 24 నెలల పాటు ఉంటుందిదీనితో పాటు జియో ఉచిత కాలవ్యవధి, ఆకర్షణీయమైన ప్లాన్ ను కూడా అందిస్తుంది.

ఈ భాగస్వామ్యం పై డిఎంఐ ప్రతినిధి మాట్లాడుతూ, “2021లో స్మార్ట్ఫోన్ అనేది వినియోగదారులు తమ ఆర్థిక లావాదేవీలాకు ఉపయోగిస్తున్న ప్రముఖ పరికరం. వందల మిలియన్ల మంది భారతీయులకు డేటా యాక్సెస్ ను అందించి వారి కలలను సాకారం చేయడానికి ఒక అడుగును దగ్గరగా తీసుకువస్తున్న జియో నెక్స్ట్ ఫోన్ తో ప్రారంభమయ్యిరానున్న రోజుల్లో  అనేక రకాల కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కు ఫైనాన్సింగ్ అందించడానికి రిలయన్స్ రిటైల్ తో భాగస్వామ్యం అయినందుకు మాకు గర్వంగా  ఉంది" అని అన్నారు.


2021-11-01  Business Desk

rajapush