6tvnews

Header - Ramky
collapse
...
Home / ఆధ్యాత్మికం / బోధనలు / ఆదిశంకరాచార్య బోధించిన బౌద్ధం ‘అద్వైతం’

ఆదిశంకరాచార్య బోధించిన బౌద్ధం ‘అద్వైతం’

2021-11-05  Spiritual Desk
venus

adi shankaracharya
 

 

‘టెంపుల్’ అనేది ఆధ్యాత్మిక వెలుగు చూపే బాటగా మారింది. వీటన్నిటికీ మూలకారణంగా ఆదిశంకరాచర్య నిలిచారు.హిందూత్వ ముసుగులో ఉన్న ప్రచ్ఛన్న బౌద్ధుడని ఆయనను కొందరు హిందువులు విమర్శించారు. అదే సమయంలో.....బౌద్ధ మతానికి ఆగర్భశత్రువని ఎందరో బౌద్ధులు ఆయనను కోపగించుకున్నారు. ఆ రెండు రకాల విమర్శలకూ ఆయన అతీతం. అదే ఆయన అద్వైతం. ఆయనే జగద్గురు ఆదిశంకరాచర్య.    

ఒక వైపున బౌద్ధం...మరో వైపున జైనం....రెండింటి మధ్య చిక్కి ....చిక్కిపోతున్న హైందవం. సరిగా ఆ సమయంలోనే అపరపరమాత్మగా, విష్ణుమూర్తి అవతారంగా వచ్చారు శంకరాచార్య. తన అద్వైతంతో ఆయన ఆ రెండింటి బారి నుంచి హిందూ మతాన్ని కాపాడగలిగారు. ఆయన భాష్యం ధాటికి ఆ రెండు మతాల ప్రాభవం తగ్గిపోయింది. నిజానికి అంతకంటే ముందే....సైద్ధాంతికంగా బౌద్ధ మత ప్రాభవం క్షీణించడం మొదలైంది. దేశంలో బౌద్ధ మతానికి ఊపిరి పోసిన వ్యక్తిగా అశోకుడిని చెబుతారు. అలాంటి అశోకుడే తనను తాను దేవానాం ప్రియ (దేవతలకు ప్రియమైన వాడు) గా అభివర్ణించుకున్నాడు. అప్పటికి బౌద్ధంలో దేవతలు లేరు. అసలు ఉండరు కూడా. అయినా కూడా అశోకుడు దేవతలను స్మరించుకున్నాడు. బౌద్ధ మత మూల విశ్వాసాలపై తొలి దెబ్బ ఆనాడే పడింది.    

పూర్వ వర్తమానశకం 2వ శతాబ్ది నుంచి వర్తమాన శకం 6వ శతాబ్ది దాకా దేశంలో బౌద్ధం ఒక వెలుగు వెలిగింది. అశోకుడు బౌద్ధ మతాన్ని అభిమానించినా...విశ్వసించింది మాత్రం హైందవాన్నే అని కూడా అంటారు .   రాజు స్వయంగా దేవతలను నమ్మితే ప్రజలు ఊరుకుంటారా...అలా బౌద్ధంలోకి హిందూ దేవతలు చొరబడ్డారు. బౌద్ధ పండితులు బౌద్ధ ధర్మసూత్రాల పుస్తకాలను సరస్వతి స్తోత్రంతో   మొదలెట్టేవారు. ఎంతో మంది బౌద్ధులు వినాయకుడు, కాళిక లాంటి దేవతలను బౌద్ధ రూపాల్లో ఆరాధించడం మొదలెట్టారు. అలా ఓ ప్రత్యేక మతంగా దాని పతనం ప్రారంభమైంది.  అలా మొదలైన బౌద్ధ మత పతనం శంకరాచార్య వాదనాపటిమతో మరింతగా దిగజారింది. చివరకు దేశం విడిచివెళ్లింది.    

ఆదిశంకరాచార్యులు మోక్ష చింతన అత్యున్నత స్థాయిలో బౌద్ధ బోధనలను స్వీకరించారు. కర్మలు అన్నిటినీ వదిలేసి శూన్యంపై మనస్సు కేంద్రీకరించాల్సిందిగా సూచించారు. అటు బుద్ధుడు, ఇటు శంకరాచార్యలు....ఇద్దరి బోధన ఒకటే. ఆరంభదశలోనే ఒకేసారి లాంగ్ జంప్ చేసి మోక్షం సాధించాలని బుద్ధుడు చెప్పాడు. అలా చేయడం సామాన్యులకు కష్టం. అందుకే మొదట కర్మలు చేయాల్సిందిగా సూచిస్తూ...ఆ తరువాత వాటిని వదలాల్సిందిగా బోధిస్తూ మోక్షం దిశగా నడిపించారు శంకరాచార్యులు. ఆత్మ, కర్మ విషయంలో కొన్ని విబేధాలు ఉన్నప్పటికీ....ఇద్దరి అంతిమ లక్ష్యం ఒక్కటే. కాకపోతే దాన్ని చేరుకునే మార్గాలు వేరు. బౌద్ధంలో చేరుకోవడం కష్టమయ్యేది అద్వైతంలో సులభతరమైంది. అందుకే అది ప్రజలకు నచ్చింది. జైనం లాంటి ఇతర మతాల విషయంలోనూ ఇలానే జరిగింది.    

ఇలా  హిందూత్వం అన్ని మతాలనూ అక్కున చేర్చుకుంది. దేశంలో నేడు కొన్ని మతాలు హిందూ మతానికి విభిన్నం అంటున్నా....ప్రజలు మాత్రం వాటిని హిందూ సంస్కృతి దిశగానే మళ్లిస్తున్నారు. ఇతర మతాల్లోనూ ‘టెంపుల్’ అనేది ఆధ్యాత్మిక వెలుగు చూపే బాటగా మారింది. వీటన్నిటికీ మూలకారణంగా ఆదిశంకరాచర్య నిలిచారు.   


 


2021-11-05  Spiritual Desk

rajapush