6tvnews

Header - Ramky
collapse
...
Home / న్యూస్ / జాతీయం / నేటికీ రాక్షసులు ఉన్నారు....ఎక్కడో తెలుసా?

నేటికీ రాక్షసులు ఉన్నారు....ఎక్కడో తెలుసా?

2021-11-06  News Desk
venus

asur tribe
 

 

రాక్షస తెగ....వినడానికే విచిత్రంగా ఉంది కదా. ఈ తెగకు చెందిన వారు సుమారు 800 మంది పశ్చిమ బెంగాల్ లో నివసిస్తున్నారు. తమ భాషా సంస్కృతులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీళ్లు ఒక రకమైన గిరిజనులే. టుమ్డా, టమక్ – ఈ రెండు రకాల సంగీత వాయిద్యాలు రెండు రకాల గిరిజన డోళ్లు. మనకు పండుగలు ఉన్నట్లే...వీరికీ ఉంటాయి. ఏటా రెండు సార్లు చెట్లకు పూజలు చేస్తారు. పండుగ ఉన్నా.... లేకపోయినా డాన్స్ చేయడం మాత్రం రొటీన్. ఈ డోళ్లు మోగుతుంటే....పదహారేళ్ళ బాలిక మొదలుకొని డెబ్భై ఏళ్ళ వృద్ధురాలి వరకూ అంతా కలసి నాట్యం చేస్తుంటారు.      

బెంగాల్ ఉత్తర ప్రాంతంలో అలీపూర్ దురాస్ పట్టణం శివార్లలోని మజ్ హర్ డబ్రి టీ ఎస్టేట్ కు ఉత్తరంగా కాలకూట్ బునో బస్తీ ఉంది. దీన్నే కాల్ కూట్ గిరిజన గ్రామంగా కూడా వ్యవహరిస్తుంటారు. తమది అసుర జాతి అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ జాతి వారిని దోర్ గా వ్యవహరిస్తుంటారు. తేయాకు తోటల కార్మికులుగా అక్కడక్కడా కనిపిస్తుంటారు.    

దేశమంతటా దుర్గాపూజలు ఘనంగా జరిగే సమయంలో...ఇక్కడ మాత్రం ఎలాంటి వేడుకలు ఉండవు. ఇక్కడ ఉండేవారిలో కొందరు ఈ వేడుకలకు దూరంగా ఉంటారు. ఆ రోజున వారు మహిషాసురుడు హతమైపోయిన బాధలో ఉంటారు. ఆ మహిషాసురుడు మరెవరో కాదు.....గత వైభవోపేత కాలంలో మహిషాసురుడు వీరి పూర్వీకుడు.    

బెంగాల్ మొత్తంలో ఈ తెగ వారు 800కు మించి ఉండరు. వీరి భాషా సంస్కృతులు అంతరించిపోతున్నాయి. దుర్గా దేవి విజయాన్ని వీరు వేడుక చేసుకోరు. జిత్తులతో దుర్గా దేవి తమ వంశమూలపురుషుడిని హతమార్చిందని విశ్వసిస్తారు. అంతే కాదు....ఉత్తరాది వారు తూర్పు భారత్ పై చేసిన దండయాత్రకు ప్రతీకగా దుర్గా పూజలు జరుగుతాయని నమ్ముతారు. వీరు ఇలా చెప్పుకోవడాన్ని స్థానికులు అవహేళన చేస్తుంటారు. వారి పట్ల అనుమానపు చూపులతో వ్యవహరిస్తుంటారు.    

 రాక్షస (అసురి) భాషను పునరుద్ధరించేందుకు ఈ రాక్షస తెగ పాత తరం ఎంతగానో ప్రయత్నిస్తోంది. అయితే ఈ తెగలోని కొత్త తరం వారు మాత్రం తమ తాతముత్తాతలు చెప్పే పుక్కిటి కథలను వినేందుకు సిద్ధంగా లేరు. తాము మహిషాసుర వారసులమని వారెంత మాత్రం విశ్వసించడం లేదు. ‘అసుర’ అనే ముద్ర తమ ఉనికికే ముప్పు తెచ్చేదిగా ఉందని భావిస్తున్నారు. అందుకే వారు అసుర ముద్రను వదిలించుకొని వ్యవహారంలో ఉండే సాధారణ గిరిజన ఇంటి పేర్లను స్వీకరిస్తున్నారు. పాత తరం మాత్రం తమ సాంస్కృతిక విశ్వాసాలను రాబోయే తరానికి అందించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అదే సమయంలో ఇతర గిరిజనుల మాదిరిగానే వీరిలో కూడా పలువురు క్రైస్తవం పట్ల ఆకర్శితులవుతున్నారు. మెరుగైన జీవనం కోసం అంటూ మతం మారుతున్నారు. ఈ రాక్షస తెగలో ఇప్పటికే సగం మంది మతమార్పిళ్లకు గురయ్యారు.      


 


2021-11-06  News Desk

rajapush