6tvnews

Header - Ramky
collapse
...
Home / చదువు / ఫిజిటల్ విధానం లోనూ బేసిక్ ఫస్ట్

ఫిజిటల్ విధానం లోనూ బేసిక్ ఫస్ట్

2021-10-25  Education Desk
venus

online classes
 

 

విద్యార్థులకు సమగ్ర అభ్యసన ఎంపికలను, బోధనా విధానాలను అందిస్తున్న, ఝార్ఖండ్ కు చెందిన ల్యాబ్ సెలెక్టెడ్ ఎడ్ టెక్ స్టార్టప్ అయిన బేసిక్ ఫస్ట్ దేశంలో, విదేశాల్లో 300కు పైగా డౌట్ క్లియరెన్స్ సెంటర్స్ ప్రారంభించనున్నట్లు   ప్రకటిం చింది. ఇది యూఏఈలో 15, సింగపూర్ లో 3 కేంద్రాలను ప్రారంభించనుంది. మరింత ప్రభావపూరితంగా చదువుకునేం దుకు గాను విద్యార్థులకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ తరగతులు నిర్వహించడం ద్వారా తన ఫిజిటల్ మాడ్యూల్ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) ను నిర్మించుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.  డౌట్ క్లియరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు గాను బేసిక్ ఫస్ట్ ఆయా పాఠ శాలలు, కోచింగ్ సెంటర్లతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటోంది. ఈ సంస్థ ఇప్పటికే 45కు పైగా నగరాల్లో 85కు పైగా సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.    

ఫ్లయింగ్ ఫ్యాకల్టీ    

  బేసిక్ ఫస్ట్ తన బోధన సిబ్బంది సంఖ్యను కూడా విస్తరిస్తోంది. తమ సబ్జెక్టుల్లో దీర్ఘకాలిక అ నుభవం, నైపుణ్యం కలిగిన వారిని తీసుకుంటోంది. అంతేగాకుండా ఫ్లయింగ్ ఫ్యాకల్టీ కూడా ఉంటారు. కోర్సు ను, విద్యార్థుల అవసరాలను బట్టి వీరు నెలలో ఒకటి లేదా రెండు సార్లు ఆయా కేంద్రాలకు వెళ్తారు. రాంచీ, ది ల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ కేంద్రంగా ఈ ఫ్లయింగ్ ఫ్యాకల్టీ పని చేస్తారు. అంతేగాకుండా, స్టేట్ బోర్డ్ వి ద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ కు అనుగుణంగా ఉర్దూతో సహా ప్రాంతీయ భాషల్లో బోధించేందుకు గాను బేసిక్ ఫస్ట్ అర్హులైన ఉపాధ్యాయులను కూడా నియమిస్తోంది.      

డౌట్ క్లియరింగ్ సెషన్స్ అవసరాన్ని బట్టి, 24*7 టెక్ట్స్ లేదా చాట్ మెసేజెస్ రూపంలో షెడ్యూల్ చేశారు. ఈ ప్రోగ్రామ్ కె6 నుంచి కె12 స్థాయి విద్యార్థులకు ఉంటుంది. 22 స్టేట్ బోర్డ్స్ కు చెందిన వారు, 84 పోటీ పరీక్ష లకు సన్నద్ధమయ్యే వారు దీన్ని ఉపయోగించుకోవచ్చు.    

కస్టమైజ్డ్ ఇంటరాక్టివ్ ఎడ్యుకేషనల్ కంటెంట్    

బేసిక్ ఫస్ట్ అనేది బూట్ స్ట్రాప్డ్ ఎడ్ టెక్ స్టార్టప్. కస్టమైజ్డ్ ఇంటరాక్టివ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ ను అందిస్తుంది. ఏఐ /ఎంఎల్ టెక్నాలజీతో మిళితమై ఉండే  ఈ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ విద్యార్థులు నేర్చుకోవడాన్ని వేగవంతం చేస్తుంది. విద్యాభ్యాసం అనుభూతిని మెరుగుపరుస్తుంది. వ్యక్తిగతీకరించబడిన లైవ్ – లెర్నింగ్ సెషన్ విద్యార్థు లకు ఆవశ్యక కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆప్టిట్యూడ్, సబ్జెక్ట్ కంపిటెన్సీ, విద్యాత్మక ఆశయాలు, పోటీ పరీక్ష ల్లో విజయం, తమ కెరీర్ లో ముందంజలకు  అవసరమైన ప్రాథమిక అవగాహనను అందిస్తుంది.    

ఇటీవలి కాలంలో ఈ స్టార్టప్, ద్వితీయ శ్రేణి నగరాల నుంచి వచ్చిన పటిష్ఠ డిమాండ్ కారణంగా గత తొమ్మిది నెలల కాలంలో 52 శాతం సీఏజీఆర్ తో నెలవారీ ప్రాతిపదికన 100శాతం వృద్ధి సాధిస్తూ వచ్చింది. కంపెనీ ఇటీవల అమెరికాలో తన సీటీఓ నియామకాన్ని, అదే విధంగా భారత్, అమెరికా, యూఏఈ, సింగపూర్ మార్కెట్లలో 1000కి పైగా మార్కెటింగ్, సేల్స్, టెక్నికల్ సిబ్బంది నియామక వ్యూహాన్ని కూడా ప్రకటించింది.    


 


2021-10-25  Education Desk

rajapush