6tvnews

Header - Ramky
collapse
...
Home / చదువు / హెచ్‌సీఎల్‌ ఫస్ట్‌ కెరీర్స్‌.. బెస్ట్‌ ఆఫర్‌

హెచ్‌సీఎల్‌ ఫస్ట్‌ కెరీర్స్‌.. బెస్ట్‌ ఆఫర్‌

2021-11-10  Education Desk
venus

computer engineer training
 

ఐటీ సర్వీసెస్‌ సెక్టార్‌ అదిపెద్ద కంపెనీల్లో ఒకటైన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మరో కొత్త ప్రోగ్రామ్‌తో ముందుకు వచ్చింది. గతంలో ఇంటర్మీడియట్‌ వారికోసం ‘టెక్‌ బీ’ మాదికిగానే.. ఐటీ సర్వీస్‌లో మంచి కెరీర్‌ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్స్‌ను పూర్తిస్థాయిలో ప్రొఫెషనల్‌ ఐటీ ఇంజినీర్స్‌గా తీర్చిదిద్దేందుకు ‘హెచ్‌సీఎల్‌ ఫస్ట్‌ కెరీర్స్‌’ పేరుతో మరో ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. హెచ్‌సీఎల్ ఫస్ట్ కెరీర్స్ ప్రోగ్రామ్‌ను కంపెనీ అనుబంధ విభాగమైన హెచ్‌సీఎల్ ట్రైనింగ్ అండ్ స్టాఫింగ్ సర్వీసెస్ (హెచ్‌సీఎల్ టీఎస్ఎస్) ద్వారా అందించనున్నారు. ఈ ప్రోగ్రామ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి హెచ్‌సీఎల్‌ ఐటీ ఇంజినీర్స్‌గా శిక్షణనిచ్చి ఉద్యోగ భద్రత కల్పించనుంది. ఇందుకోసం ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.   


ఆరు నెలలు.. రూ.1.5 లక్షల ఫీజు: 

హెచ్‌సీఎల్ ఫస్ట్ కెరీర్స్ ప్రోగ్రామ్‌ పూర్తిగా ఫ్రెషర్స్‌కు ఉద్దేశించింది, ఇందులో ఫ్రెషర్స్‌ ఉద్యోగాల్లో విజయవంతం కావడానికి అనుభజ్ఞులైన నిపుణులతో ఆరునెలల పాటు టెక్నికల్, రియల్‌టైమ్‌ శిక్షణనిస్తారు. అంతేగాకుండా ఉద్యోగ పోటీలో రాణించేందుకు అవసరమైన పర్సనల్‌ డెవలప్‌మెంట్‌ స్కిల్స్‌పై కూడా శిక్షణ ఉంటుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో ఉద్యోగాలు కల్పిస్తారు. ఆరు నెలల కాలవ్యవధి గల ఈ ప్రోగ్రామ్‌కు హెచ్‌సీఎల్‌ రూ.1,50,000 ఫీజుగా నిర్ణయించింది, దీనికి పన్నులు అదనం. అయితే, అభ్యర్థులకు బ్యాంకు రుణాలు పొందేందుకు హెచ్‌సీఎల్‌ సహరిస్తుందని సంస్థ పేర్కొంది. ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్నవారికి ఆన్‌లైన్ కౌన్సిలింగ్, ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపింక చేస్తారు.  


అర్హతా ప్రమాణాలు: 

 బిఈశ్రీ బీటెక్‌/ ఎంసిఏ/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ (ఐటీ/ కంప్యూటర్‌ సైన్స్‌) పూర్తిచేసిన ఫ్రెషర్స్‌తో పాటు రెండేళ్ల వరకు వర్కింగ్‌ అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.  

విజయవాడ, లక్నో, నాగ్‌పూర్, మదురై నగరాలకు చెందినవారైతే బిఎస్సీ (ఐటీ/ కంప్యూటర్ సైన్స్), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ (బి.ఓసీ- సీఎస్/ఐటీ/సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్), బిసిఏ గ్రాడ్యుయేట్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఎంపికైనవారికి ఆయా నగరాల్లోనే ఐటీ ఇంజినీర్స్‌గా శిక్షణనిచ్చి, ఉద్యోగం కల్పిస్తారు.   అభ్యర్థులకు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వరకు 65 శాతం పైగా మార్కులు తప్పనిసరి  2018, 2019, 2020, 2021 సంవత్సరాల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. 


వర్చువల్‌ ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌:  

ఆరు నెలల కాలవ్యవధి గల ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల వర్చువల్‌ క్లాస్‌ రూమ్‌ ట్రైనింగ్‌ (ఇంటి నుంచే యాక్సెస్‌ చేసుకోవచ్చు), మరో మూడు నెలలు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో ప్రొఫెషనల్ ప్రాక్టీస్ టర్మ్ ట్రైనింగ్‌ ఉంటుంది. ఈ శిక్షణను హెచ్‌సీఎల్ అనుబంధ విభాగమైన హెచ్‌సీఎల్ ట్రైనింగ్ అండ్ స్టాఫింగ్ సర్వీసెస్ నిర్వహిస్తుందని సంస్థ పేర్కొంది. సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత హెచ్‌సీఎల్‌లోనే ఐటీ ఇంజినీర్స్‌గా నియమిస్తారు. గతంలో ఈ ప్రోగ్రామ్‌ ద్వారా 18 వేల మంది ఐటీ ఇంజినీర్స్‌గా శిక్షణ పూర్తిచేసుకుని సంస్థలో చేరారని, ఈ ఏడాది ప్రోగ్రామ్‌లో మరో 22 వేల మందికి అవకాశం కల్పించనున్నట్టు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.  


ఎలాంటి డిపాజిట్లు లేవు  

‘‘హెచ్‌సీఎల్ ఎటువంటి ‘రిక్రూట్‌మెంట్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, ‘సెక్యూరిటీ డిపాజిట్, సాఫ్ట్‌వేర్ లేదా ఎక్విప్‌మెంట్ ఛార్జీలు, లేదా హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం పొందడం కోసం ఎలాంటి ఇతర ఫీజులుగాని వసూలు చేయదని సంస్థ ప్రకటించింది. పైగా తమ సంస్థకు అవసరమైన సిబ్బందికి శిక్షణనిచ్చేందుకు ఎలాంటి భాగస్వాములు లేరని, ఈ శిక్షణ ప్రోగ్రామ్ కేవలం హెచ్‌సీఎల్ ట్రైనింగ్ అండ్‌ స్టాఫింగ్ సర్వీసెస్ ద్వారా మాత్రమే అందిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లోనే నియమిస్తారన్నారు. 


 


2021-11-10  Education Desk

rajapush