6tvnews

Header - Ramky
collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / ఐఐటి ఖరగ్ పూర్ తో ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ‘వీర్డో’ భాగస్వామ్యం

ఐఐటి ఖరగ్ పూర్ తో ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ‘వీర్డో’ భాగస్వామ్యం

2021-11-10  Lifestyle Desk
venus

Fashion show
 

దేశంలో ప్రముఖ ఆన్ లైన్ ఫ్యాషన్ బ్రాండ్స్ లో ఒకటిగా వెలుగొందుతున్న ‘వీర్డో’ ఐఐటి ఖరగ్ పూర్ కు చెందిన వ్యవస్థాపక విభాగం తో భాగస్వామ్యం ఏర్పర్చుకున్నట్టు ప్రకటించింది. ఐఐటి ఖరగ్ పూర్ లో ఈ విభాగం స్థాపించిన 15 ఏళ్ళలో దాదాపు 300 కు పైగా అంకుర పరిశ్రమలు(స్టార్ట్ అప్స్) విజయవంతంగా ఆవిష్కృతమయ్యాయి. ఐఐటి ఖరగ్ పూర్ నిర్వహించే వ్యవస్థాపక, స్థానికంగా ఉన్న అంకుర పరిశ్రమల ఆశావహుల  అవగాహనా సదస్సుకు వీర్డో క్యాంపస్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.

ఈ సంస్థ నిర్వహించే అతి పెద్ద పాన్ ఇండియా అవగాహనా సదస్సులో వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజెల్ ఇన్వెస్టర్స్, కొత్త తరం ఔత్సాహికులు పాల్గొంటారు. పర్యావరణ వ్యవస్థకు ఊతమిచ్చేవిధంగా పరిశ్రమల స్థాపనలోగల అవకాశాల గురించి ఈ ప్రముఖులు విద్యార్ధులకు మార్గదర్శనం చేస్తారు. ఈ సదస్సుకు ప్రముఖ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులతో పాటు ప్రాధమిక దశలో ఉన్న స్టార్ట్ అప్ ఆవిష్కర్తలు కూడా హాజరయ్యారు.

సదస్సు ఉద్దేశం..

క్యాంపస్ అంబాసిడర్ గా వీర్డో కంపెనీ ప్రత్యక్షంగా 25 ప్రదేశాల్లో 140  సంస్థలనుంచి 27వేల మంది విద్యార్ధులతో మమేకమవుతుంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 మంది కార్పోరేట్ ప్రతినిధులు, 800 మంది పారిశ్రామికవేత్తలతో అనుబంధం కలిగి ఉంటుంది.  యువ పారిశ్రామిక వేత్తలు కావాలనుకునే  27 వేల మందికి పైగా  విద్యార్ధులలో నూతన ఆవిష్కరణ స్ఫూర్తిని రగిలించడమే ఈ భాగస్వామ్య లక్ష్యం.

కొత్త తరం వ్యాపార ఆలోచనలతో నూతన స్టార్ట్ అప్ (అంకుర పరిశ్రమలు) స్థాపనకు అవసరమయ్యే సహాయ సహాకారాలు అందించడమే ఈ  సదస్సు ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా తగిన శిక్షణ, మార్గనిర్దేశం, పేటెంట్ ఎలా పొందాలి అనే అంశాలతో బాటు అవసరమైన ఆర్ధిక సహకారాన్ని కూడా అందిస్తారు.

నేడు ఆన్ న్ లైన్ షాపింగ్ చేసే కస్టమర్లకు అత్యుత్తమ ఫ్యాషన్ ఉత్పత్తులు అందించే ప్రముఖ సంస్థగా వీర్డో గుర్తింపు పొందింది. రాబోయే తరానికి అనుగుణంగా కొత్త ఆలోచనలతో వచ్చే స్టార్ట్ అప్ లకు ప్రోత్సాహం ఇచ్చే విషయంలో  భావ సారూప్యంగల సంస్థలతో కలిసి ఈ స్టార్ట్ అప్ కంపెనీ విజయవంతంగా నూతన శిఖరాలను అధిరోహించింది.  డబ్బుకు తగ్గ విలువ కల్పిస్తూ నాణ్యత, వైవిధ్యమైన ఫ్యాషన్ లతో నేటి ట్రెండ్ కు తగ్గ ఉత్పత్తులను అందించే స్టార్ట్ అప్ కంపెనీగా వీర్డో పేరొందింది.

ఔత్సాహిక యువకులకు వేదికగా..

కాగా, ఐఐటీఅ ఖరగ్ పూర్  కు చెందిన వ్యవస్థాపక విభాగం తో భాగస్వామ్యం పై వీర్డో  సహ వ్యవస్థాపకుడు ధవల్ అహిర్  మాట్లాడుతూ ‘నూతన ఆవిష్కరణలలో సరిహద్దులు చెరిపేస్తూ ఆకాశమే హద్దుగా తమ కంపెనీ ముందుకు సాగుతోందని‘ అన్నారు. ప్రతీ చోటా కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్  ఉత్పత్తులను అందించే క్రమంలో ముందుకు సాగుతున్నామన్నారు. ఉత్తమ వ్యాపార ఆలోచనలు కలిగిన యువమేధావులతో భాగస్వాములవడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే తరాలకు నూతన ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు వచ్చే యువకులకు ఒక వేదికగా తమ భాగస్వామ్యం దోహదపడుతుందన్నారు. తమ భాగస్వామ్యం ఫ్యాషన్ ప్రపంచానికి నూతన ట్రెండ్ ను అందించగలదన్న విశ్వాసాన్ని ధవల్ అధిర్ వ్యక్తం చేశారు.


2021-11-10  Lifestyle Desk

rajapush