6tvnews

Header - Ramky
collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / ఎథికల్ ఫ్యాషన్ ఈవెంట్ కు లండన్ ఆర్గానిక్ ఆతిథ్యం

ఎథికల్ ఫ్యాషన్ ఈవెంట్ కు లండన్ ఆర్గానిక్ ఆతిథ్యం

2021-11-10  Lifestyle Desk
venus

organic fashion
 

ఫ్యాషన్ రంగాన్ని పరిపుష్టం చేసేందుకు వీలుగా లండన్ సమాజాన్ని ప్రతిబింబిస్తూ ‘లండన్ రిప్రజెంట్స్’ పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తోంది. లండన్ కు చెందిన పలువురు డిజైనర్లు, మోడల్స్ కు గమ్యస్థానంగా నిలిచే ఓ అద్భుత ప్రదర్శనను ఇది ఏర్పాటు చేసింది.    ఆర్బోరెటమ్ వద్ద జరిగిన ఈ ఈవెంట్ ను లండన్ ‘ఆర్గానిక్ బ్యూటీ’ స్పాన్సర్ చేసింది. లండన్ ఫ్యాషన్ రంగం తో పాటు ఆ నగర సమాజ వైవిధ్యాన్ని, విభిన్న రీతులను ప్రతిబింబిస్తూ  ఈ ఈవెంట్ నిర్వహించింది. ఫ్యాషన్ రంగ భవిష్యత్తు, సుస్థిరత్వమే లక్ష్యంగా  ఆర్బోరేటమ్ లో నిర్వహించిన ప్రదర్శన లండన్ రిప్రజెంట్స్ మోడల్స్  కు కచ్చితమైన గమ్యస్థానంగా నిలుస్తుంది.  


లండన్ రిప్రజెంట్స్ అంటే ఏమిటి...? 


లండన్ రిప్రజెంట్స్ ను గతంలో 'లండన్స్ మోస్ట్ ఎన్విరాన్ మెంటల్లీ  ఫ్రెండ్లీ మెంబర్స్ క్లబ్' అని పిలిచేవారు.  ఈ ఈవెంట్ లో పలువురు ప్రముఖ, ఔత్సాహిక ఫ్యాషన్ డిజైనర్స్ పాల్గొని తమ కలెక్షన్స్ ప్రదర్శించారు. ఎథికల్ స్ట్రీట్ వేర్, సిల్క్ ప్రింటెడ్ సెకండ్ హ్యాండ్ దుస్తులు,అల్లికలకు సంబంధించిన కలెక్షన్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఫ్యాషన్ రంగం సుస్థిర భవిష్యత్ వైపు సాగేలా విద్యుద్దీప కాంతులతో ఆఫ్రికన్ హెయిర్ స్టైల్స్ స్ఫూర్తి రగిలించింది. సంగీత కార్యక్రమాల మధ్య జరిగిన ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఫొటో బూత్ తో ఆ రంగంలో ఉన్న ప్రముఖుల పరిచయాలు, ముచ్చట్లతో పాటు స్టాల్స్ ను సందర్శించిన ఆహుతలు ఎంతో  ఆనందించారు. ఈ రంగంలోకి రావాలనుకునేవారికి స్పూర్తిగా నిలిచే వైవిధ్యభరితమైన ఈ క్యాట్ వాక్ ప్రదర్శన చక్కటి అవకాశమని   పారాలింపియన్, లండన్ రిప్రజెంట్స్  మోడల్ లూయీస్ హంట్ పేర్కొన్నారు. 


ప్రదర్శన లక్ష్యం ..పర్యావరణ హితం..!  


మోడల్స్ కు ఇష్టమైన రీతిలో లండన్ సమాజాన్ని ప్రతిబింబించే విధంగా ఫ్యాషన్ రంగానికి దీప శిఖగా నిలిచేలా ఈ ప్రదర్శనలు ఉండాలని లండన్ ఆర్గానిక్ భావిస్తోంది. ఈ ప్రదర్శనలోని కలెక్షన్ష్ అన్నీ ఔత్సాహిక మోడల్స్ కు తగిన విధంగా  వైవిధ్యభరితంగా ఆకట్టుకునే రీతిలో ఏర్పాటయ్యాయి.  నేటి సమాజానికి ప్రాముఖ్యమిస్తూ ప్రతినిధిగా ఈ క్యాట్ వాక్ లో భాగస్వామి కావడం తనకు లభించిన గొప్ప అవకాశమని విటిలిగో అనే మోడల్ తన అనుభవాన్ని వివరించారు. ఫ్యాషన్ రంగం వైవిధ్యభరితంగా సుస్థిర సమ్మిళిత అభివృద్ధి, భవిష్యత్ ను సాధించాలనే లండన్ రిప్రజెంట్స్ లక్ష్యం ఈ ప్రదర్శనతో విజయవంతమైంది... 


 


2021-11-10  Lifestyle Desk

rajapush