6tvnews

Header - Ramky
collapse
...
Home / లైఫ్ స్టైల్ / పర్యాటకం / బెస్ట్ టూరిజం విలేజ్ గా పోచంపల్లి

బెస్ట్ టూరిజం విలేజ్ గా పోచంపల్లి

2021-11-16  Lifestyle Desk
venus

pochampally
 

తెలంగాణ పల్లెకు ఓ అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఎంపిక చేసిన అత్యుత్తమ పర్యాటక గ్రామాల్లో ఒకటిగా హైదరాబాద్ సమీపంలోని పోచంపల్లి నిలిచింది. ఇక్కత్ అనే ప్రత్యేక శైలిలో స్థానికులు అందమైన చీరలు నేస్తారు. అందుకే ఈ గ్రామాన్ని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా కూడా వ్యవహరిస్తారు.  స్పెయిన్ లోని మాడ్రిడ్ లో యూఎన్ డబ్ల్యూటీఓ జనరల్ అసెంబ్లీ 24వ సెషన్ జరుగనుంది. ఆ సందర్భంగా ప్రతిష్టాత్మక అవార్డును అందించనున్నారు. పోచంపల్లికి ఈ అవార్డు వచ్చిన సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పోచంపల్లి గ్రామస్తులను అభినందించారు. ‘‘ ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘ఓకల్ ఫర్ లోకల్’ కింద పోచంపల్లి విశిష్ట శైలికి ప్రత్యేక గుర్తింపు లభించింది. తెలంగాణ ప్రజల తరఫున....మరీ ముఖ్యంగా పోచంపల్లి గ్రామ ప్రజల తరఫున నేను ఈ అవార్డును అందుకోనున్నాను. పోచంపల్లి ఖ్యాతిని దూర తీరాలకు తీసుకెళ్లడంలో సహకరించిన అధికారులకు ధన్యవాదాలు’’ అని కిషన్ రెడ్డి అన్నారు.   

యూఎన్ డబ్ల్యూటీవో చేపట్టిన పైలట్ కార్యక్రమం ‘ది బెస్ట్ టూరిజం విలేజ్’. గ్రామీణ పర్యాటక గమ్యస్థానాలుగా ఉన్న గ్రామాలను గుర్తించి అవార్డులు బహుకరించడం ఈ కార్యక్రమం లక్ష్యం. తొమ్మిది విభాగాల కింద నిర్దేశించుకున్న మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఎంపికలు చేస్తారు. ఆయా గ్రామాలు తమ గ్రామీణ పర్యాటకాన్ని పెంచుకునేందుకు వీలుగా ఆయా గ్రామాలకు అండగా నిలుస్తారు. మెరుగైన అవకాశాలు పొందేందుకు వీలుగా శిక్షణ ఇస్తారు. 

భారత్ నుంచి బెస్ట్ టూరిజం విలేజ్ ఎంట్రీలుగా మూడు గ్రామాల పేర్లను పర్యాటక మంత్రిత్వ శాఖ పంపించింది. తెలంగాణ లోని పోచంపల్లితో పాటుగా  మేఘాలయ లోని కోంగ్ తాంగ్, మధ్యప్రదేశ్ లోని లాధ్ పురా కూడా వీటిలో ఉన్నాయి. వీటిలో నుంచి పోచంపల్లి ఎంపికైంది.  పోచంపల్లి ఇక్కత్ కు 2004లో జియోగ్రాఫికల్ ఇండికేటర్ (జీఐ) హోదా కూడా దక్కింది. 


 


2021-11-16  Lifestyle Desk

rajapush