6tvnews

Header - Ramky
collapse
...
Home / బిజినెస్ / ఫైనాన్స్ / యాక్సిస్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌

యాక్సిస్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌

2021-11-17  Business Desk
venus
  • ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకం. భారీమధ్య తరహా,  చిన్న తరహా క్యాప్‌ స్టాక్స్‌ లో  పెట్టుబడులు పెడుతుంది.
  • కనీస పెట్టుబడి (ఎన్‌ఎఫ్‌ఓ) : రూ.5వేలు 
  • ఎన్‌ఎఫ్‌ఓ కాలం : నవంబర్‌ 26,2021 నుండి డిసెంబర్‌ 10,2021
  • ఫండ్‌ మేనేజర్‌ : అనుపమ్‌ తివారీ– ఈక్విటీ ఫండ్‌ మేనేజర్‌సచిన్‌ జైన్‌– డెబ్ట్‌ సెక్యూరిటీస్‌

దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఫండ్‌ హౌస్‌లలో ఒకటైన యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తమ నూతన ఫండ్‌ ఆఫర్‌– యాక్సిస్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌ను విడుదల చేసింది. ఈ  ఫండ్‌ను నవంబర్‌ 26,2021 న తెరువడంతో పాటు గా డిసెంబర్‌ 10 న మూయనున్నారు. ఈ ఎన్‌ ఎఫ్‌ఓ ద్వారా మదుపరులు భారీమధ్య తరహా, చిన్న తరహా క్యాప్‌ స్టాక్స్‌ లో పెట్టుబడులు పెట్టే అవకాశం కలుగుతుంది. ఈ స్కీమ్‌ను అనుపమ్‌ తివారీ, సచిన్‌ జైన్‌యాక్సిస్‌ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ నిర్వహించనున్నారు.

ఈ ఎన్‌ఎఫ్‌ఓ ఆవిష్కరణ గురించి యాక్సిస్‌ ఏఎంపీ  ఎండీ అండ్‌ సీఈవో చంద్రేష్‌ నిగమ్‌ మాట్లాడుతూ ‘‘మారుత్ను మార్కెట్‌ పరిస్థితులతో పాటుగా మదుపరుల ప్రయోజనార్థం బాధ్యతాయుతంగా ఉండటాన్ని మేం నమ్ముతుంటాం. మా దీర్ఘకాల లక్ష్యాలు కేవలం మూలధనం కాపాడటం మాత్రమే కాదు రాబడుల పరంగానూ ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ వ్యూహాన్ని దృష్టిలో ఉంచుకుని మేం యాక్సిస్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌ ఆవిష్కరించాం. ఈ ఫండ్‌తో ఒకే పోర్ట్‌ ఫోలియోలో మా మదుపరులు భారీమధ్యచిన్న క్యాప్‌లలో పెట్టుబడులు పెట్టవచ్చు, మార్కెట్‌ ఒడిదుడుకులనూ అధిగమించ వచ్చు. మా మార్కెట్‌వ్యాప్త కేటాయింపుల వ్యూహాలు, మా సిద్ధాంతాలతో దీర్ఘకాలంలో స్థిరమైన వృద్థి సాధ్యమవుతుంది అని నమ్ముతున్నాం’’ అని అన్నారు.


2021-11-17  Business Desk

rajapush