6tvnews

Header - Ramky
collapse
...
Home / బిజినెస్ / ఆటోమొబైల్ / వాహన లీజింగ్‌, సబ్‌స్ర్కిప్షన్‌ వ్యాపారంలోకి మహీంద్రా ఫైనాన్స్‌

వాహన లీజింగ్‌, సబ్‌స్ర్కిప్షన్‌ వ్యాపారంలోకి మహీంద్రా ఫైనాన్స్‌

2021-11-17  Business Desk
venus

xuv 700
 

మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ తన  లీజింగ్‌,  సబ్‌స్ర్కిప్షన్‌ బిజినెస్‌   Quiklyz’ ని అధికారికంగా ఆవిష్కరించింది. దీనిద్వారా కారు యాజమాన్యపరంగా ఎలాంటి అవరోధాలు లేకుండా సరికొత్త కారు ను సొంతం చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ బీమా కారు నిర్వహణ ,   రోడ్‌ సైడ్‌ అసిస్టెన్స్‌ వంటి అంశా లను క్విక్లీజ్‌ చూసుకుంటుంది.

మొదటి దశలో క్విక్లీజ్‌ ఈ సేవలను బెంగళూరు చెన్నై ఢిల్లీ గురుగ్రామ్‌ హైదరాబాద్‌ ముంబై నోయిడా పూనెలలో ప్రారంభించి అనంతర కాలంలో   టియర్‌  2 నగరాలకు విస్తరించనుంది.   రాబోయే సంవత్సర కాలంలో  30 నగరాలలో ఈ సేవలను ప్రారంభించనుంది. 

కార్పోరేట్‌ (బీ 2 బీ), రిటైల్‌ (బీ 2 సీ) వినియోగదారులకు క్విక్లీజ్‌ లభ్యమవుతుంది. బీ 2 బీ విభాగంలో ఈ కంపెనీ తమ సేవలను కార్పోరేట్‌, ఫ్లీట్‌ యజమానులకు అందించనుంది. 

ఈ ఆవిష్కరణ గురించి మహీంద్రా ఫైనాన్స్‌ లిమిటెడ్‌ వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌   రమేష్‌ అయ్యర్‌   మాట్లాడుతూ  ‘‘ భారతదేశంలో కారు లీజింగ్‌, చందా వ్యాపారం అత్యంత వేగంగా వృద్ధి చెందుతుంది. రాబోయే  3–5 సంవత్సరాలలో   రూ. 10 వేల కోట్ల   వ్యాపారం చేరుకోవాలన్నది మా లక్ష్యం. లాస్ట్‌ మైల్‌ మొబిలిటీ విభాగంలో మరీ ముఖ్యంగా ఈవీ లలో లీజింగ్‌కు అసాధారణ వృద్ధి కనిపిస్తుంది. భారతీయ వాణిజ్య వినియోగదారులకు లీజింగ్‌ అనేది నూతన నేపథ్యమే అయినప్పటికీ , ఈ విభాగంలో మహీంద్రా ఫైనాన్స్‌ ముందుండాలని కోరుకుంటున్నాం ’’  అని అన్నారు.

  క్విర్ల్కీ  ఎస్‌వీపీ అండ్‌ బిజినెస్‌ హెడ్‌ తుర్రా మొహమ్మద్‌ మాట్లాడుతూ  ‘‘ వాహన యాజమాన్య పరంగా సౌకర్యాన్ని వినియోగదారులు కోరుకుంటున్నారు. క్విర్ల్కీతో మేము సౌకర్యవంతమైన   రీతిలో వాహనం సొంతం చేసుకునే అవకాశం అందిస్తున్నాం. ప్రస్తుతం  10% కార్పోరేట్‌ రిజిస్టర్డ్‌ వాహనాలు లీజింగ్‌లో ఉన్నాయి. రాబోయే ఐదేళ్లలో ఇది  20–25% కు చేరవచ్చు ’’  అని అన్నారు.


2021-11-17  Business Desk

rajapush