6tvnews

Header - Ramky
collapse
...
Home / బిజినెస్ / ఎనర్జీ / రెన్యూఎక్స్ షో ప్రారంభం

రెన్యూఎక్స్ షో ప్రారంభం

2021-11-20  Business Desk
venus

solar farm5
 

అగ్రగామి బి2బి ఎగ్జిబిషన్స్ నిర్వహణ సంస్థ అయిన ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా రెండు రోజుల రెన్యువబుల్ ఎనర్జీ ట్రేడ్ ఎక్స్ పో రెన్యూఎక్స్ 5వ ఎడిషన్ ను హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ప్రారంభించింది. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్   జి.రఘుమా రెడ్డి, హైదరాబాద్ లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ అండ్రూ ఫ్లెమింగ్, తెలంగాణ ప్రభుత్వ ఎనర్జీ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి  సునీల్ శర్మ, పిడబ్ల్యూసీ డైరెక్టర్ (పవర్ అండ్ యుటిలిటీస్)  భాగ్యతేజ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు & వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం ముఖ్య కార్యదర్శి  జయేశ్ రంజన్, ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్  యోగేశ్ ముద్రాస్, ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా గ్రూప్ డైరెక్టర్ ఎనర్జీ పోర్ట్ ఫోలియో  రజనీశ్ కట్టార్ ఈ ఎక్స్ పో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దక్షిణ భారతదేశ పునరుత్పాదక ఇంధన వనరుల రంగానికి చెందిన పలువురు ప్రముఖులు దీనికి హాజరయ్యారు. 

మొదటి రోజున సీఈఓ కాన్ క్లేవ్ జరిగింది. ‘ఫ్రమ్ యాంబిషన్ టు యాక్షన్ – ఎ విజనరీ డిబేట్’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు & వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూ నికేషన్స్ విభాగం ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అధ్యక్షత వహించారు. తెలంగాణ రాష్ట్ర ఎనర్జీ విభాగం మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అజయ్ మిశ్రా సహ - అధ్యక్షత వహించారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్  ఆలివర్ బాల్ హాచెట్ ప్రత్యేక ప్రసంగం చేశారు. ఈ కాన్ క్లేవ్   ఆర్ఇఐ &ఇ-మొబిలిటీ విభాగాల్లో పెట్టుబడి వ్యూహాలను ఉన్నతీకరించడం,  ) ఆంత్రప్రెన్యూరియల్ ల్యాండ్ స్కేప్, ప్రభుత్వ కార్యక్రమాలు,  తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అత్యంత విద్యుద్దీకరణ జరిగిన రాష్ట్రంగా చేసేందుకు అవసరమైన ప్రయత్నాలు అనే అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది.  

రెన్యూ ఎక్స్ కు అండగా నిలవడంలో తెలంగాణ రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ముందు వరుసలో నిలిచింది. దేశంలో అత్యంత విద్యుద్దీకరణ జరిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విజయవంతమైన కార్యక్రమాలకు అది మారుపేరుగా నిలిచింది. ఈ ఏడాది, మొదటిసారిగా ఈ ఎక్స్ పో యూకే ఉనికిని చూసింది. ‘పార్ట్ నర్ కంట్రీ’గా అది చేరింది. రెన్యూ ఎక్స్ లో ఎక్స్ క్లూజివ్ పెవిలియన్ ను నెలకొల్పింది. 

ఈపీసీ కంపెనీలు, పీవీ మాడ్యూల్స్, హైబ్రిడ్ సిస్టమ్స్, మెటీరియల్స్ అండ్ ఎక్విప్ మెం ట్స్, ఇన్వర్టర్లు, చార్జ్ కంట్రోలర్స్, బ్యాటరీలు, టెస్టింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్స్, కాంపొనెంట్ తయారీదారు లు, బయోఎనర్జీ ఉపకరణాల తయారీదారులు, బ్యాక్ షీట్ తయారీదారులు, సిస్టమ్స్ ఇంటిగ్రేటర్స్ తో పాటుగా వివిధ విభాగాల సరఫరాదారులు, పంపిణిదారులు ఈ షో లో పాల్గొన్నారు. 


 


2021-11-20  Business Desk

rajapush