6tvnews

Header - Ramky
collapse
...
Home / ఆరోగ్యం / కేన్సర్ / స్టమక్ / గాస్ట్రిక్ కేన్సర్ వ్యాధి - లక్షణాలు - అవగాహన

స్టమక్ / గాస్ట్రిక్ కేన్సర్ వ్యాధి - లక్షణాలు - అవగాహన

2021-11-21  Health Desk
venus

gastric cancer stomach
 

సమాజంలో ఇప్పటికీ కేన్సర్ వ్యాధి అంటే భయమే. వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా, ఎన్నిఆథునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చినా, కేన్సర్ వ్యాధిపట్ల భయం తొలిగిపోలేదు. దీనికి నకారణం ముఖ్యంగా తగినంత అవగాహన లేకపోవడమే. నవంబర్ నెలను కేన్సర్ అవగాహనా మాసంగా పరిగణిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.   

కేన్సర్ లలో పలు రకాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టమక్ కేన్సర్ లేదా గాస్ట్రిక్ కేన్సర్. ఏళ్ళపాటు లోలోపలే వ్యాపించడం, పైకి ఎటువంటి లక్షణాలు కనిపించకపోవడం  వల్ల  దీనిని ప్రాధమిక దశలో గుర్తించడం కష్టం. అంతేగాక కుటుంబ పరంగా, జన్యు పరంగా సంక్రమించే అవకాశాలతో పాటు పండ్లు, కూరగాయలు తక్కువగా తినడం, ఉప్పు, వేపుడు పదార్ధాలు ఎక్కువగా తినడం వంటి కారణాలతో  కేన్సర్ ముప్పు అధఇకంగా ఉంటుందని నిపుణులు పచెబుతున్నారు.   

మన దేశంలో  స్టమక్ కేన్సర్ లేదా గాస్ట్రిక్ కేన్సర్ తో బాధపడుతున్న రోగులలో 20 శాతం కంటే తక్కువ మంది పేషెంట్లలో మాత్రమే ప్రారంభ దశలో గుర్తించే వీలుంది. 50 శాతం మందిలో అడ్దాన్స్డ్ స్టేజి( ముదిరిపోయన దశలో) లోనే తెలుసుకోగలుతున్నారు. అయితే 25-30శాతం  మందికి విస్తృతమైన లేదా మెటాస్టాటిక్ వ్యాధి ఉంది.   

ఇది భారతదేశంలో పురుషులలో మూడవ అత్యంత సాధారణ క్యాన్సర్. 15 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులు మరియు స్త్రీలలో క్యేన్సర్ సంబంధిత మరణాలకు అత్యంత సాధారణమైన  రెండవ కారణం. అందువల్ల నవంబర్ నెలను  ఈ ప్రాణాంతక వ్యాధి గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.   

నాగపూర్ కు చెందిన జర్జికల్ అంకాలజీ కన్సల్ టెంట్ డాక్టర్ కృనాల్ ఖోబ్రాగడే స్టమక్ కేన్సర్ గురించి, దాని లక్ణాలు గురించి ఇలా వివరించారు.  మానవ శరీరంలో దిగువ భాగంలో ఉండే యాంట్రమ్/డిస్టల్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ భారతీయ జనాభాలో సర్వసాధారణం అని డాక్టర్ ఖోబ్రగాడే చెప్పారు. స్టమక్ కేన్సర్ రావడానికి ముందగు కడుసులోపలి పొరలలో(మ్యుకస్) లో కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ లక్షణాలు  చాలా అరుదుగా కనబడడంవల్ల వెంటనే గుర్తించడం కష్టమవుతుందన్నారు.   

స్టమక్ కేన్సర్ (కడుపు క్యాన్సర్)  లేదా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ యొక్క లక్షణాలు :  

"కడుపులోని వివిధ ప్రాంతాలలో వచ్చే క్యాన్సర్‌లు వేర్వేరు లక్షణాలను కలిగి అనేక ఇతర ఫలితాలను కలిగి ఉంటాయి. క్యాన్సర్ కణాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి దాన్ని బట్టి చికిత్స ను నిర్ధారిస్తారు." అని డాక్టర్ ఖోబ్రగాడే చెప్పారు.  

గమనించవలసిన లక్షణాలు ఇవి:  

* ఏమైనా తిన్నప్పుడు, తాగినప్పుడు మింగడంలో ఇబ్బందిగా ఉండడం  

* తక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్న తర్వాత ఉబ్బరం లేదా కడుపు నిండినట్టు ఉండడం  

* పొత్తికడుపు ప్రాంతంలో, సాధారణంగా నాభికి పైన ఇబ్బందిగా అసౌకర్యంగా ఉండడం  

* తీవ్రమైన, నిరంతర గుండెల్లో మంట లేదా అజీర్ణం  

* ఎప్పుడూ  వికారంగా ఉండడం  

* కడుపు నొప్పి  

* రక్తంతో లేదా రక్తం లేకుండా నిరంతర వాంతులు  

* అనుకోకుండా బరువు తగ్గడం  

* అలసట  

* మలబద్ధకం  

*  మార్పులు వల్ల వల్ల ముదురు మలం  

* పొత్తికడుపులో వాపు   

గ్యాస్ట్రిక్ క్యాన్సర్ నివారణకు సూచనలు :  

- అధిక బరువు లేదా ఊబకాయం స్టమక్ క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో  సహాయపడుతుంది.  

- తాజా పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారం ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. నారింజ, నిమ్మకాయలు మరియు ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లు మందచి.  

- ఆల్కహాల్ తాగడం వల్ల ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది, కాబట్టి ఆల్కహాల్ వినియోగాన్ని నివారించడం లేదా పరిమితం చేయడం వల్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.  

- హెచ్‌పైలోరీ ఇన్‌ఫెక్షన్‌కి చికిత్స చేయడం: హెచ్‌పైలోరీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న వ్యక్తులకు యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల కడుపులో క్యాన్సర్‌కు ముందు వచ్చే గాయాల సంఖ్య తగ్గుతుందని,స్టమక్  క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని ప్రాధమిక అధ్యయనాలు సూచిస్తున్నాయి.  

అధిక జన్యుపరమైన ప్రమాదం ఉన్న వ్యక్తులు జన్యు పరీక్ష చేయించుకోవడంపై జన్యుశాస్త్ర నిపుణుడిని సంప్రదించవచ్చు. ఈ లక్షణాలు, కేన్సర్ పరిమాణం  కనిపెట్టేందుకు ముందస్తు రోగనిర్ధారణ, పరిక్షలు ముఖ్యం.  ఏవైనా లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. ప్రారంభ దశలోనే రోగనిర్ధారణ చేయడం వల్ల మెరుగైన చికిత్స చేసేందుకు  సహాయపడుతుంది. ప్రారంభ దశలో రోగనిర్ధారణ చేస్తే కోలుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.   


2021-11-21  Health Desk

rajapush