6tvnews

Header - Ramky
collapse
...
Home / క్రీడలు / బాస్కెట్ బాల్ / గెలుపుబాటలో భారత్ బాస్కెట్‌బాల్‌ జట్టు

గెలుపుబాటలో భారత్ బాస్కెట్‌బాల్‌ జట్టు

2021-11-23  Sports Desk
venus

saba championship 2021
 

సౌత్ ఏషియన్ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్ నిర్వహించే SABA ఛాంపియన్‌షిప్ పోటీలు బాస్కెట్‌ బాల్ ప్రేమికులను అలరించాయి.  విశేష్ బృగువంశీ నేతృత్వంలోని భారత జట్టు ఈ టోర్నీలోని ప్రత్యర్ధులను చిత్తు చేసింది.  శ్రీలంక, మాల్దీవుల జట్లతో పాటు బంగ్లాదేశ్‌ను కూడా ఓడించింది. SABA ఛాంపియన్‌షిప్‌ను ఆరోసారి గెలుచుకుంది. ఫైనల్స్‌ లో ఆతిధ్య జట్టు బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. 106-41 తేడాతో ఘన విజయం సాధించింది. చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. 

ఫేవరెట్ జట్టుగా బరిలో దిగిన భారత్‌ ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది. సునాయాస విజయాలు అందుకుంది. ఏ జట్టు నుంచి ప్రతిఘటన ఎదురుకాలేదు. 

తొలి మ్యాచ్‌లో భారత్‌ మాల్దీవులను 83-31 తేడాతో ఓడించింది. 57 పాయింట్ల ఆధిక్యం కనబరిచింది. ఇక రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడిన భారత్ 114-48 తేడాతో విజయం సాధించింది.  

ప్రపంచ బాస్కెట్‌బాల్‌  ప్రకారం భారత జట్టు 78వ స్థానంలో ఉంది. శ్రీలంక 132, మాల్దీవులు 142 స్థానాల్లో ఉండగా...బంగ్లాదేశ్ 146వ స్థానంలో కొనసాగుతోంది. 

గతంలో ఐదుసార్లు గెలుపు 

భారత బాస్కెట్ బాల్ జట్టు గతంలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. 2002, 2014, 2015, 2016, 2017లో జరిగిన టోర్నీలలో తన సత్తా చాటింది. విజేతగా నిలిచింది. ఈ ఏడాది జరిగిన పోటీల్లో కూడా తన ఆధిపత్యాన్నినిలుపుకుంది. 


 


2021-11-23  Sports Desk

rajapush