వయోవృద్ధులకు ఆరోగ్యపరమైన సమస్యలు శరీరంలోని ఏ భాగంలో అయినా ఎప్పుడైనా తలెత్తవచ్చు. వాటికి ముందస్తు అంచనాలు, సూచనలు ఏమీ ఉండకపోవచ్చు కూడా. కానీ సర్వసాధారణంగా వృద్ధులు ఎదుర్కొనే సమస్యలలో ముఖ్యమైనది – శరీరంలోని ఏదో ఒక భాగం లేదా అంగం సామర్థ్యం కోల్పోవడం. ఆ కోణంలో సాధారణ సమస్యలుగా కనిపించే కొన్ని లక్షణాలు, వాటి వల్ల వచ్చే సమస్యలు పరిశీలించాలి.
ముస్కులోస్కెలిటల్ (బలహీనం కావడం) – జాయింట్లు అరిగిపోయిన కారణంగా జాయింట్ల వద్ద ఇన్ ఫ్లమేషన్ (దీనిని ఆస్టోఆరిథ్రైటిసి అంటారు), ఎముకల బలహీనత (ఆస్టోపోరోసిస్), కండరాల పటిష్టత తగ్గిపోవడం, కాళ్లు, చేతుల వేళ్లకు సంబంధించిన సమస్యలు (దీనిని గౌట్ అంటారు), ముఖ కండరాల క్షీణత, ఎముకలు విరిగిపోవడం.
హార్మోనల్ – సమస్య కారణంగా రక్తంలో షుగర్ పెరిగిపోవడం, మోనోపాజ్, థైరాయిడ్, రక్తంలో అధిక కొలెస్టరాల్, ఇంకా మొత్తం మీద శరీరంలోని మెటబాలిజమ్ మందగించడం.
న్యూరోలాజికల్ – నరాల పటుత్వం తగ్గిపోయి డెమెన్షియా లేదా అల్జీమీర్స్ లేదా పార్కిన్ సన్ వ్యాధి, గుండె సంబంధ జబ్బులు, కంటి చూపు, వినికిడి దెబ్బతినడం, శరీరం బ్యాలెన్స్ లేకపోవడం.
కంటి చూపు – విషయంలో కండరాలు జీవకళ కోల్పోవడం, గ్లుకోమా, కాటరాక్ట్, డయాబిటిస్, హెపర్ టెన్షన్ సంబంధిత కంటి సమస్యలు
కార్డియోవస్కులలార్ – గుండె సంబంధిత సమస్యలు, (హార్ట్ ఎటాక్, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్, ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్ (గుండె నాళాల సంకోచవ్యాకోచాలు), హై బ్లడ్ ప్లెషర్, ఆర్థిరోస్లిరోసిస్ (రక్తనాళాలు కుంచించుకుపోవడం), పెరిఫిరల్ వస్కులార్ లేదా ఆర్టరీ సమస్యలు (రక్త ప్రసరణ సంబంధిత),
లంగ్స్ – ఊపిరితిత్తుల పనితీరు సాఫీగా జరగకపోవడం వల్ల క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ), ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోవడం.
కిడ్నీలు (మూత్రపిండాలు) – దీర్ఘకాలం మధుమేహం, హైపర్ టెన్షన్ (అధిక రక్త పోటు) ఉండడంతో మూత్రపిండాలు తమ సామర్థ్యం కోల్పోవడం,
స్కిన్, జుత్తు – చర్మం పొడిబారడం, జుత్తు రాలిపోవడం, ఇచ్చింగ్, ఇతర ఇన్ ఫెక్షన్స్
క్యాన్సర్స్ – ప్రాస్ట్రేట్ (వీర్యోత్పత్తి), కోలోన్ (పెద్ద పేగు), లంగ్ (ఊపిరి తిత్తులు), బ్రెస్ట్ వక్షస్థలం), స్కిన్ (చర్మం), బ్లాడర్ (మూత్రపిండం), ఒవరీ (అండాశయం), బ్రెయిన్ (మెదడు), పాంక్రియాస్ (క్లోమ గ్రంధి) వంటివి క్యాన్సర్ కు గురికావచ్చు.
బోన్ మారో, రోగనిరోధక శక్తి – క్షీణించిపోయినట్లయితే రక్త కణాల ఉత్పత్తి దెబ్బతింటుంది. ఫలితంగా రక్తహీనత సమస్య ఎదురవుతుంది.
గాస్ట్రో ఇంటెస్టినల్ – పొట్టలో పుండ్లు (అల్సర్స్), క్లోమ గ్రంధి చుట్టూ హానికర పదార్థాలు పేరుకుపోవడం (డైవర్టిక్యులోసిస్), క్లోమ గ్రంధి వాపు, లేదా కోలోటిస్ సంక్రమిత సమస్యలు (రక్త ప్రసరణ సమస్య), ఆహారం మింగడంలో ఇబ్బంది (డైస్ ఫగియా), మలబద్ధకం, హెర్మోరాయిడ్స్ వంటి సమస్యలు వస్తాయి.
యూరినరీ – మూత్ర విసర్జన విషయంలో అసమానతలు,, ఇబ్బందులు
ఓరల్, డెంటల్ – గమ్ వ్యాధులు, నోరు ఎండిపోవడం, పళ్లు ఊడిపోవడం, పళ్ల పటిష్టత తగ్గిపోవడం
ఇన్ ఫెక్షన్స్ – మూత్రనాళాల (యూరినరీ) ఇన్ ఫెక్షన్, న్యుమోనియా, చర్మ సంబంధ సమస్యలు, మూత్రకోశంలో రాళ్లు ఏర్పడడం (షింగిల్స్), పెద్ద పేగు (కోలోన్) ఇన్ ఫెక్షన్ వంటి ఇబ్బందులు
సైకియాట్రిక్ – నిరాశనిస్పృహలు, ఆందోళన, సరిగా నిద్ర పట్టకపోవడం, నిద్రలేమి
ఇతర సమస్యలు – ఆలసట, నిస్సారం, మరపు, మందుల సైడ్ ఎఫెక్ట్స్, ఆకలి మందగించడం, బరువు తగ్గిపోవడం, జారిపడిపోవడాలు.