6tvnews

Header - Ramky
collapse
...
Home / వినోదం / తెలుగు / తెలుగు ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్

తెలుగు ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్

2021-11-24  Entertainment Desk
venus

romantic telugu1
 

వెంకటేష్‌ నటించిన దృశ్యం  2,  ఆకాశ్ పూరి నటించిన రొమాంటిక్ సాయిధరమ్‌ తేజ్ నటించిన రిపబ్లిక్‌..ఈ మూడు సినిమాలు నవంబర్  25 న ఓటీటీలో వినోదాన్ని అందించడానికి రెడీ అయ్యాయి. నవీన్ చంద్ర నిటించిన  BRO  చిత్రం నవంబర్  26 న ప్రేక్షకుల ముందుకు రానుంది.    

ప్రైమ్‌ వీడియోలో దృశ్యం  2    

నవంబర్  25 న దృశ్యం  2 మూవీ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. వెంకటేశ్ మీనా లీడ్‌ రోల్స్ చేసిన ఈ మూవీ , 2014 లో వచ్చిన దృశ్యం సినిమాకు సీక్వెల్‌. మలయాళంలో సూపర్ హిట్‌ అయిన దృశ్యం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. మలయాళంలో మోహన్ లాల్‌ హీరోగా నటించి బంపర్ హిట్ కొట్టాడు. వెంకటేశ్‌ కూడా మంచి సక్సెస్‌ అందుకున్నాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత మలయాళంలో సీక్వెల్‌ రిలీజ్‌ అయిన కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో తెలుగులో కూడా సీక్వెల్‌ తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇప్పటికే తెలుగులో రిలీజ్‌ అయిన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. తమ అభిమాన హీరో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వెంకటేశ్ ఫ్యాన్స్ ను.. దృశ్యం  2 తప్పకుండా అలరిస్తుందని సినీ పండితులు చెబుతున్నారు.         

ఆహాలో రొమాంటిక్‌ మూవీ    

ఆకాశ్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్‌ చిత్రం ఆహా ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదల అవుతోంది. కేతికా శర్మ ఆకాశ్‌ పక్కన హీరోయిన్‌గా నటించింది.      థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో ఈ సినిమా చూడని వారికి ఇంట్లోనే వీలున్నప్పుడు చూసుకునే అవకాశం కలగనుంది.    

ZEE5 లో రిపబ్లిక్ చిత్రం    

ఇక సాయిధరమ్‌ తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం  ZEE5 ద్వారా స్ట్రీమింగ్ కానుంది.      ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించింది. మంచి కథతో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టలేకపోయినా..విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో నడిచే ఈ సినిమా స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ద్వారా మరింత మంది ప్రేక్షకులకు దగ్గర కానుంది.     

SONY LIV లో  BRO  మూవీ    

నవీన్ చంద్ర నటించిన  BRO  చిత్రం  SONY LIV  ద్వారా ప్రేక్షకులను చేరువ కానుంది.      అన్నా చెల్లెల్ల అనుబంధం ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం సోనీ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. వినోదంతో పాటు మంచి సందేశం ఉన్న చిత్రం అని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. మరాఠీలో విజయవంతమైన హ్యాపీ జర్నీకి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. ఓ అన్న జీవితాన్ని ఓ చెల్లి ఎలా మార్చిందనే విషయం ఆధారంగా కథను అల్లుకున్నారు.     

టీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా..జెజెఆర్ రవిచంద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు.    

 

 


2021-11-24  Entertainment Desk

rajapush