6tvnews

Header - Ramky
collapse
...
Home / వినోదం / హిందీ / దుమ్ము రేపుతున్న అత్రంగీ రే ట్రైలర్

దుమ్ము రేపుతున్న అత్రంగీ రే ట్రైలర్

2021-11-24  Entertainment Desk
venus

Atrangi Re
 

అత్రంగీ రే చిత్ర ట్రైలర్ విడుదల అయి దుమ్ము రేపుతోంది. అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్, ధనుష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ముగ్గురి ఎంట్రీ సీన్లు ఎంతో వైవిధ్యంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ హై ఎనర్జీ కనిపిస్తోంది. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే అంశాలు ఇంకా అనేకం ఉన్నాయని డైరెక్టర్ తెలిపాడు. 

మేజికల్ రియలిజమ్ మూవీ   

అత్రంగీ రే మూవీ మేజికల్ రియలిజమ్ ఆధారిత కథా చిత్రం. డిసెంబర్ 24న డిస్సీ హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది. రెండు వేర్వేరు కాలాల్లో ఇద్దరు ప్రేమికుల మధ్య ఓ యువతి ఏ విధంగా నెట్టుకువచ్చిందో వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమే అత్రంగీ రే. సారా అలీఖాన్ రింకు పాత్రలో లీనమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. 

ధనుష్ రీ ఎంటీ   

ఈ సినిమా ద్వారా ధనుష్ బాలీవుడ్ పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో ఓ హిందీ చిత్రంలో నటించిన ధనుష్ అక్కడి అభిమానుల హృదయాలను కొల్లగొట్టాడు. సోనమ్ కపూర్ తో కలిసి నటించిన ఆ సినిమా మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది. 

విషు అనే క్యారెక్టర్ ద్వారా ధనుష్ తన సత్తా ఏంటో హిందీ ప్రేక్షకులకు మరోసారి చూపించున్నాడు. ధనుష్ ఎంట్రీ సీన్లలో తమిళం మాట్లాడే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 

ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం ఉందని నమ్మడం వల్లే హాట్ స్టార్ ద్వారా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. 


2021-11-24  Entertainment Desk

rajapush