6tvnews

Header - Ramky
collapse
...
Home / క్రీడలు / క్రికెట్ / టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్

టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్

2021-11-25  Sports Desk
venus

TEST CAP1
 Picture courtesy: ICC Twitter

భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు కాన్పూర్ నగరంలోని గ్రీన్ పార్క్ స్టేడయంలో ప్రారంభమయింది. భారత్ తరపున తొలి టెస్టులో అజింక్యా రహానే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మయాంక్ అగర్వాల్ , శుభ్ మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.   

 

విరాట్ కోహ్లీ , కేఎల్ రాహుల్ , మహ్మద్ షమీ , జస్ప్రీత్ బుమ్రా , రిషబ్ పంత్ తదితర స్టార్ ప్లేయర్లు లేకుండానే భారత్ బరిలో దిగింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ టెస్టు సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ టెస్టు అరంగేట్రం చేశాడు. భారత్ లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ శ్రేయాస్ అయ్యర్ చేతికి టెస్టు క్యాప్ అందజేశాడు.   

 

శుభమన్ గిల్ , మయాంక్ అగర్వాల్ , చటేశ్వర్ పుజారా , అజింక్యా రహానే , శ్రేయాస్ అయ్యర్ , వృద్ధిమాన్ సాహా , రవీంద్ర జడేజా , అక్షర్ పటేల్ , రవిచంద్ర అశ్విన్ , ఇషాంత్ శర్మ , ఉమేష్ యాదవ్ తదితరులు తుది జట్టులో స్థానం సంపాదించారు.   

 

తిరిగి జట్టులో చేరిన కేన్ విలియమ్ సన్       

కేన్ విలియమ్సన్ తిరిగి జట్టులో చేరడంతో కివీస్ జట్టు బలంగా కనిపిస్తోంది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్న కివీస్ జట్టు ఈ ఏడాది జూలైలో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారతజట్టును ఓడించి విజేతగా నిలిచింది. టెస్టు సిరీస్ లో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది.

 


2021-11-25  Sports Desk

rajapush