6tvnews

Header - Ramky
collapse
...
Home / న్యూస్ / జాతీయం / రైతు చట్టాల రద్దు లోగుట్టు

రైతు చట్టాల రద్దు లోగుట్టు

2021-11-25  News Desk
venus

farmer protest
 

పౌరసత్వ చట్టం పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించిన కఠినమైన వైఖరిని తను తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో ఎందుకు అనుసరించలేకపోయింది? ఎందుకు వెనక్కు తగ్గి వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసింది? అనే సందేహం సహజంగానే వస్తుంది. కొత్త వ్యవసాయ చట్టాలపట్ల ఎంతటి వ్యతిరేకత వచ్చిందో అందరికీ తెలుసు. ఏడాదికి పైగా రైతులు వెనక్కి తగ్గకుండా ఉద్యమం నడిపించారు. లోగడ పౌరసత్వ చట్టం విషయంలో కూడా ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఉద్యమమే నడిచింది. పౌర చట్టాన్ని ప్రతిఘటిస్తూ దేశంలో అనేక చోట్ల ఆందోళనలు జరిగాయి. నిరసనలు వెల్లువెత్తాయి. కానీ మోడీ వెనక్కు తగ్గలేదు. ఇప్పుడు వ్యవసాయ చట్టాల పట్ల ఎందుకు మెత్తబడాల్సి వచ్చింది. అందుకు కారణం ఉంది. అదేమిటంటే … రైతుల మాదిరిగా ముస్లింలు బిజెపికి ప్రధాన ఓటు బ్యాంక్ కాదు. కాబట్టి పట్టించుకోకపోయినా మోడీకి వచ్చే నష్టమేం లేదు.       

 

 నవంబర్ 19న ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల్ని రద్దు చేశారు. ప్రజల ఒత్తిడికి తలవొగ్గి … ప్రధానమైన విధాన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆ చట్టాలను రద్దు చేసినప్పటికీ ఆయన వ్యవహారశైలి గురించి తెలిసిన ఎవరూ కూడా అలా బహిరంగ క్షమాపణ చెబుతారని అనుకోలేదు. ఆయన క్షమాపణ నిజమైనదా కాదా అన్నది వేరే విషయం.      

ఎందుకిలా ?      

మోడీ ప్రభుత్వం వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చి ఏడాది పైనే అయింది. తీవ్రమైన వ్యతిరేకత కూడా వచ్చింది. మరి ఇంతకాలం తర్వాత ఇప్పుడు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది?      

సింపుల్ గా చెప్పాలంటే రెండు కారణాలు కనబడుతున్నాయి.మొదటిది : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతుల ఉద్యమం క్రమంగా పుంజుకుంది. వీళ్లేం చేస్తారులే అనుకున్న ఆ రైతులు వెనక్కు తగ్గలేదు. నాటకీయంగా ఉద్యమం బలపడింది. ఏడాది గడిచినా పట్టు సడల లేదు. చెక్కు చెదరలేదు. దాన్ని ఎలా  ఎదుర్కోవాలో, ఎలా నీళ్లు చల్లాలో మోడీ ప్రభుత్వానికి  తెలీడం లేదు. రెండోది: వ్యవసాయ రాష్ట్రాలైన పంజాబ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మోడీగారి కళ్ల ముందు అవే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఈ రెండు రాష్ట్రాల్లో బలంగా ఉన్న రైతు సంఘాలతో విరోధం పెట్టుకుంటే, వారి మాటను కాదంటే,  విస్మరిస్తే మొదటికే మోసం రావచ్చని ప్రధాని అర్థం చేసుకున్నారు. ఆధునిక హిందూత్వ రాజకీయ ప్రాజెక్ట్ కు మూలస్తంభం అనదగిన కీలకమైన ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాన్ని నరేంద్రుడు ఎలా వదులుకుంటారు? ఎన్నికలు రాబోతున్నందున ఏర్పడిన అత్యవసర పరిస్థితి ఇది. అయితే, మోడీ హయాంలో ఒక ప్రధానమైన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడమనేది ఇదే మొదటిసారి కాదు. మరో ముఖ్య విషయం ఏమంటే … రాష్ట్ర ఎన్నికల ముందు అదివరకు తీసుకున్న ప్రధాన విధాన నిర్ణయాలను అంత తేలికగా  ప్రస్తుత భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకత్వం తీసుకోదు. దీంతోపాటు మరికొన్ని పాచికలు కూడా పార్టీ చేతిలో ఉన్నాయి. అయితే, జాతీయ స్థాయి నిర్ణయాల ప్రభావం  రాష్ట్ర స్థాయి నియోజక వర్గాలమీద పడకూడదు అనే పార్టీ నాయకత్వం ఆలోచించింది.      

Related article : Part - 2   

Related article : Part - 3


2021-11-25  News Desk

rajapush