6tvnews

Header - Ramky
collapse
...
Home / న్యూస్ / జాతీయం / ప్రధాని మోడీ ఎందుకు వెనక్కి తగ్గారు ?

ప్రధాని మోడీ ఎందుకు వెనక్కి తగ్గారు ?

2021-11-25  News Desk
venus

farmer protest1
 

పౌరసత్వ చట్టం పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించిన కఠినమైన వైఖరిని తను తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో ఎందుకు అనుసరించలేకపోయింది ఎందుకు వెనక్కు తగ్గి వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసింది ?     

తేడా ఎక్కడొచ్చింది ?     

ఉద్యమాలను ఎదుర్కోవడం మోడీ       ప్రభుత్వానికి కానీ మరే ఇతర ప్రభుత్వాలకు కానీ కొత్త కాదు.       అయితే ఈసారి రైతు ఉద్యమం అసాధారణ రీతిలో బలపడి ప్రభుత్వానికి గుదిబండగా మారింది.           

 

ఉద్యమంలో కొన్ని భిన్న స్వరాలు వినిపించినా ఒత్తిడులు వచ్చినా లోపాలు ఎదురైనా రైతులు అన్నింటినీ విజయవంతంగా       తట్టుకుని నిలబడ్డారు.       మామూలుగా అయితే ఏదైనా ఆందోళన తీవ్రతరంగా మారుతూ చేయిదాటుతోందని అనిపించినప్పుడు ప్రభుత్వం బుజ్జగింపులకు దిగుతుంది.       నయానో భయానో చెప్పి చల్లారుస్తుంది.       కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా తయారైంది.           

 

నాలుగు సీజన్లలోనూ రైతుల ఉద్యమం సాగింది.       పంటలు వేయనందువల్ల నష్టం వచ్చినా భయపడలేదు.     

రైతుల ఉద్యమాన్ని బలహీనపరచడానికి మోడీ ప్రభుత్వం బహిరంగంగానూ రహస్యంగానూ అన్ని ప్రయత్నాలూ చేసింది.       ఆందోళనలను అణచివేసేందుకు ఏ అవకాశాన్నీ వదలలేదు.       తన మాట వినే మీడియాను సంఘటితం చేసి ఉపయోగించుకుంది.       కానీ దారుణంగా విఫలమైంది.       ఆందోళన చేస్తున్న సిక్కులను భయపెట్టేందుకు వారు ఖలీస్థానీ ఉగ్రవాదులనీ అరాచక వాదులనీ ముద్ర వేసింది.       ఒకటి మాత్రం చెప్పవచ్చు.       మోడీ భారత్ లో ఇలాంటి సీన్లు ఇకపై చూడబోమనే చెప్పాలి.     

 

  మోడీ వెనక్కు తగ్గడానికి ఒకే ఒక కారణం చెప్పవచ్చు.       అదే ఎన్నికల రాజకీయం.       సారవంతమైన నేలలాంటి ఉద్యమాన్ని తక్కువ చేసి చూపేందుకు కూడా ప్రయత్నించారు.       అయితే రైతులు ఎలాంటి ఎత్తులు వేయకుండానే పాలనా యంత్రాంగానికి గుణపాఠం చెప్పారు.       వ్యవసాయ చట్టాలే ఎన్నికలకు ప్రతిబంధకమవుతాయని తన తలకు చుట్టుకుంటాయని వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాల్సి వస్తుందని మోడీ బహుశ ఊహించి ఉండరు.     

      

అకుంఠిత దీక్ష     

రైతుల ఉద్యమం విజయం సాధించడానికి మరో ముఖ్యమైన అంశం దోహదం చేసింది.       వేరే ప్రజా ఉద్యమాలకు లభించని సామాజిక రాజకీయ ఆర్థిక బాసట ఈ రైతు ఉద్యమానికి పట్టుకొమ్మ అయింది.       ఉద్యమ నాయకుల్లో ఒకరు అందుకు ప్రారంభం నుంచే పటిష్టమైన వ్యూహాలను రచించారు.       వాటిలో మొదటిది హిందూత్వ విధానంపై నడిచే పాలకులు మతపరమైన మైనారిటీలు అంటే ముస్లింలను లక్ష్యం చేసుకున్నట్టు రైతులపై గురిపెట్ట జాలరు.       అంతే కాక ఏ ప్రభుత్వం కూడా అతి పెద్ద ఓటు బ్యాంక్ అయిన వ్యవసాయదారులను దూరం చేసుకోదు.       అది వారి రాజకీయ క్రీడకు చాలా అవసరం.       అలా చేస్తే పోలింగ్ బూత్ ల దగ్గర సీన్ రివర్స్ కావడమే కాదు.  సామాజిక స్థాయిలో ప్రభుత్వ లక్ష్యమైన హిందూత్వ విధానానికి కూడా ఎదురు దెబ్బ తగులుతుంది.     

బలమైన శక్తిగా  .           

రైతుల ఉద్యమంలో రెండో కీలకాంశం  ఇది రాజకీయంగా తరతమ భేదాలు లేకుండా కేంద్ర నాయకులను కూడా సంఘటిత పరిచింది.       పొద్దున లేస్తే పరస్పరం రాజకీయ ఆరోపణలు చేసుకునే నాయకులు కూడా ఒకరికోసం మరొకరు అన్నవిధంగా చేయి చేయి కలిపారు.       ఇది చాలా అరుదైన సన్నివేశం.       ఉద్యమంలో వారు బలమైన శక్తిగా నిలిచారు.       ప్రభుత్వ అనుకూల శక్తులు వారిని నైతికంగా దెబ్బతీయాలని పదే పదే ప్రయత్నించినా      ఆ ప్రయత్నాలు సాగలేదు.       ఉత్తర భారతంలో వ్యవసాయ రంగంలో ప్రాంతాల పరంగా మత పరంగా ఉనికి చాటుకునే అనేక తరగతులున్నాయి.       స్థాయిలున్నాయి.       అవి ఈ ఉద్యమంలో ప్రతిఫలించాయి.       ఏ వర్గం వారైనా ఏ ప్రాంతం వారైనా ఉద్యమంకోసం ముందుకొచ్చారు.       ముందుండి నడిపించారు.       ఉదాహరణకు చెరకు ఎక్కువగా పండించే పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని హిందూ జాట్ వర్గీయులు రైతు ఉద్యమం రెండో దశలో అతి ముఖ్యమైన పాత్ర పోషించారు.       వారిలో రాకేష్ తికాయత్ నాయకత్వం తిరుగులేని విధంగా ఉద్యమాన్ని నడిపింది.       ఆయన ఉద్యమానికి ఊపిరిగా నిలిచారు.       మూలస్తంభమయ్యారు.       అంతెందుకు ? 2013 లో ముజఫర్ నగర్ లో ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో రాకేష్ ప్రధాన పాత్ర పోషించారనే మచ్చ ఉంది.       అయిప్పటికీ రైతుల ఉద్యమంలో రాకేష్ తికాయత్ కు కొందరు ముస్లిం రైతులు కూడా బాసటగా నిలిచారు.     

Related article : Part 1

Related article : Part 3
 

 


2021-11-25  News Desk

rajapush