6tvnews

Header - Ramky
collapse
...
Home / న్యూస్ / జాతీయం / రైతు ఉద్యమానికి ఏ ఏ అంశాలు కలిసి వచ్చాయి?

రైతు ఉద్యమానికి ఏ ఏ అంశాలు కలిసి వచ్చాయి?

2021-11-25  News Desk
venus

farmer agitation1
 

పౌరసత్వ చట్టం పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించిన కఠినమైన వైఖరిని తను తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో ఎందుకు అనుసరించలేకపోయింది ఎందుకు వెనక్కు తగ్గి వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసింది అనే సందేహం సహజంగానే వస్తుంది .     

ధిక్కార ప్రదర్శన     

రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో నాటకీయంగా జరిగిన రైతుల ఎర్రకోట ముట్టడి తికాయత్ ధిక్కారానికి ఖలిస్థానీ చొరబాటుదారుల నుంచి ప్రభుత్వం చేసిన ప్రయత్నమని కొందరు అంటారు ఆ మాట ఎలా ఉన్నా ఉద్యమానికి అది బాగా కలిసి వచ్చింది రైతులకు ఎన్ని సంఘాలు భిన్న ధోరణులున్న నాయకత్వాలూ ఉన్నా వారంతా ప్రదర్శించిన సంఘీభావం ఏకతాటిపై నిలవడం ఉద్యమానికి పెట్టని కోట అయింది ఉద్యమాన్ని దెబ్బతీయడానికి చీలికలు తెచ్చేందుకు మోడీ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా రైతు నాయకత్వం బెదరలేదు తమ డిమాండ్లను విడనాడలేదు ఉద్యమం కారణంగా రాజకీయంగా కొన్ని నియోజక వర్గాలు దూరమవుతాయని గ్రహించిన మోడీ ప్రభుత్వం ఆ సాహసం చేయలేక దిగొచ్చింది .     

రెండు ఉద్యమాలకూ       తేడా ఏమిటి ?     

రైతుల ఉద్యమానికి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఉద్యమానికి తేడా ఏమిటి పౌరసత్వ చట్టంపై మోడీ ఎందుకు పునరాలోచన చేయలేదు ఎందుకు పట్టించుకోలేదు ..  అన్నది లోతుగా పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతుంది ముస్లింలు భారతీయ జనతా పార్టీకి ప్రధానమైన ఓటు బ్యాంక్ కాదు .    పౌరసత్వ బిల్లు వ్యతిరేక ఉద్యమం ఒక ప్రాంతానికి సంబంధించింది పైగా ముస్లింలు మాత్రమే దాని వెనక ఉన్నారని వారే నడిపించారని       ప్రచారం జరిగింది ఆ ఉద్యమాన్ని అణచివేస్తే       హిందువుల్లో మోడీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది కాబట్టి మోడీ ఆ పనే చేశారు పౌర ఉద్యమ నాయకులపై ఉగ్రవాదులని దేశ ద్రోహులనీ ముద్ర వేసి మోడీ ప్రభుత్వం అరెస్ట్ చేయించింది ప్రతి ఎన్నికలో       భారతీయ జనతాపార్టీ విజయానికి ఓట్లు పెరగడానికి అదొక కారణమంటారు .     

అన్నీ ఆలోచించి     

ఇక రైతుల ఉద్యమం కేవలం ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు దాన్ని నిర్లక్ష్యం చేస్తే దేశమంతా అది విస్తరించే ప్రమాదముంది ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం పడుతుంది పైగా ..  ఫెడరలిజం మీద అధికార పార్టీ దాడులు చేస్తోందని వ్యవసాయ మార్కెట్ ను ప్రైవేటీకరించి రైతుల కడుపు కొడుతోందని రైతు ఉద్యమ నాయకులు అదేపనిగా ఉపన్యాసాలు ఇచ్చారు కనీస మద్దతు ధరకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ మితిమీరిన చర్యలను ఎండగట్టారు వ్యవసాయ రంగంపై పెట్టుబడులు పెట్టిన అన్ని సామాజిక వర్గాలనూ మధ్యతరగతిని ఈ అంశాలు ఆకట్టుకున్నాయి రైతు ఉద్యమ ప్రభావం వ్యవసాయ ఉత్పత్తులపై పడవచ్చని ఆందోళన చెందారు నిజానికి దేశంలో మెజారిటీ ఓట్లున్న మధ్య తరగతి ప్రజల్ని ఏ పార్టీ కూడా కావాలని దూరం చేసుకోలేదు రైతుల ఉద్యమం వల్ల ఏర్పడిన పరిస్థితి తీవ్రతను మోడీ ప్రభుత్వం అర్థం చేసుకుంది ఉద్యమం కొనసాగితే అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో జరిగే       ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని మోడీ ప్రభుత్వం గ్రహించింది పైగా పౌరసత్వ చట్టంపై వచ్చిన ఉద్యమం ద్వారా ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం ఉండదు కానీ రైతుల ఉద్యమం అలా కాదు ఇది క్రమంగా ఎన్నికల్లో ప్రతిపక్షాలకు రాజకీయ       అంశం కావచ్చు అలాగే తన ఇమేజ్ పై ఆధారపడి ఎప్పటికప్పుడు ఇమేజ్ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రధాని మోడీ ఈ అంశంవల్ల తన ఇమేజ్ గ్రాఫ్ పడిపోవచ్చని ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రావచ్చని ఊహించారు ఈ కోణంలో తీవ్రంగా ఆలోచించిన మోడీ ప్రభుత్వం తను చేసిన నూతన రైతు చట్టాలను రద్దు చేసింది .    

Related article : Part 1  

Related article : Part 2  


2021-11-25  News Desk

rajapush