6tvnews

Header - Ramky
collapse
...
Home / తెలంగాణ / న్యూస్ / హైదరాబాద్ / కోవిడ్ బారిన పడ్డ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్

కోవిడ్ బారిన పడ్డ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్

2021-11-25  News Desk
venus

pocharam srinivas reddy
 

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కరోనా బారిన పడ్డారు. నిన జరిపిన వైద్య పరీక్షల్లో పోచారానికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో కుటుంబ ఆయనను గచ్చిబౌలిలోని  AIG ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల సూచనల మేరకు తాను ఆసుపత్రిలో చేరానని,మిగతా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని   తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ టెస్టు చేయించుకోవాలని కోరారు.

ఇటీవలే జరిగిన పోచారం మనవరాలి పెళ్లి 

తెలంగాణ శాసనసభా పతి పోచారం శ్రీనివాస రెడ్డి మనవరాలి వివాహం ఇటీవలే జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. వధూ వరులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రులు ఇద్దరు పక్క పక్కనే కూర్చుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. స్పీకర్ పోచరం శ్రీనివాస రెడ్డి కూడా వీరిద్దరి పక్కన కాసేపు కూర్చున్నారు. ముఖ్యమంత్రులతో పాటు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం, మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వివాహానికి హాజరయ్యారు. 

 


2021-11-25  News Desk

rajapush