6tvnews

Header - Ramky
collapse
...
Home / న్యూస్ / జాతీయం / హిందుత్వంపై ఆర్.ఎస్.ఎస్ ఏమంటోంది ?

హిందుత్వంపై ఆర్.ఎస్.ఎస్ ఏమంటోంది ?

2021-11-25  News Desk
venus

 

 

ఇటీవల కాలంలో హిందుత్వ, హిందూ ధర్మంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఈ అంశాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ప్రముఖ నేతలు ఈ అంశంపై స్పందిస్తున్నారు.   

 

ఇటీవల కాలంలో  ' హిందూత్వ ' ను దూకుడు స్వభావంగల     రాజకీయ భావజాలంగా అభివర్ణిస్తూ     మళ్లీ హిందుత్వ ' పై చర్చ జరుగతోంది. ఈ చర్చలో సాధారణంగా ఉపయోగించే కొన్ని పదాలు , జరుగుతున్న చర్చపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సవివరమైన వివవరణ ఇచ్చింది.       

 

హిందుత్వం , ' హిందూత్వం ' మరియు హిందూమతం       

 

హిందుత్వం అనేది సనాతన ధర్మం పై ఆధార పడిన     భారతీయ జీవన విధానం. హిందుత్వం అంటే హిందుమత సారాంశం అని ఆర్ఎస్ఎస్ వివరించింది.  ' భారతీయ ' జీవన విధానాన్ని సూచించడానికి -  ' హిందుత్వ ' లేదా  ' హిందూత్వం ' అనే పదాన్ని ఉపయోగిస్తుంటారని ఆర్ఎస్ఎస్ పేర్కొంది.   

 

హిందూత్వ అనేది భారతదేశంలోని శాశ్వతమైన నాగరికత విలువలలో పాతుకుపోయిన సాంస్కృతిక చట్రం. అందువల్ల దీనికి రాజకీయాలతో పెద్దగా సంబంధం లేదు అని     ఆర్ఎస్ఎస్ సహ కార్యదర్శిగా మన్మోహన్ వైద్య    2019 లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. హిందుత్వ అంటే భారతీయతకు ప్రతీకగా మారిందన్నారు.       

 

ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కె.బి. హెడ్గేవార్ , భారతీయులందరిలో ఐక్యతా భావాన్ని మేల్కొల్పడానికి ఈ హిందుత్వాన్ని సాధనంగా మార్చారు.     వారి కుల , మత , ప్రాంత , భాషలతో సంబంధం లేకుండా ఒకరితో ఒకరికొకరు సత్సంబంధాలను ఏర్పర్చుకున్నారు.     ఈ హిందుత్వం అనే దండలో పూలలా వీరంతా కలిసిలమెలిసి పోయారని వైద్య వివరించారు.       

 

ధర్మం వేరు..మతం వేరు       

 

హిందూ రాష్ట్ర అంటే భారతీయుల జీవన విధానం అని అర్ధం. మతం అనేది ఆరాధన లేక పూజతో ముడిపడి ఉంటుంది . ధర్మం అంటే ఒక ప్రత్యేకమైన జీవన విధానం. భారత దేశంలో అనేక మతాలు ఉండొచ్చు కానీ ధర్మం మాత్రం ఒకటే..అదే హిందూ ధర్మం. అందువల్ల ఇతర మతాలతో హిందూ ధర్మాన్నిసమానమని భావించకూడదన్నారు. ప్రజలు తమకు ఇష్టమైన మార్గంలో వారి వారి ఆధ్యాత్మిక లక్ష్యాలను అందుకోవచ్చు. దురదృష్టమేమిటంటే.. చీటికిమాటికి ధర్మం అనే మాటను మతం అంటూ తప్పుగా మారుస్తున్నారు అన్నారు.   

 

ఆచరణలో ధర్మం అనేది     మారని , శాశ్వతమైన , సార్వత్రిక చట్టాలత కూడి ఉంటుంది. భిన్న వైరుధ్యాలు , వైవిధ్యాల మధ్య ఏకత్వం అనేది సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం యొక్క శాశ్వతమైన సందేశం అని వైద్య వివరించారు.   

 

సెక్యులరిజం :       

 

లౌకికవాదం - సమాజం , విద్య మొదలైన వాటిలో మతం ప్రమేయం ఉండకూడదు.  1976 లో ఎమర్జెన్సీ సమయంలో ఎలాంటి చర్చ లేకుండా భారత రాజ్యాంగ పీఠికలో దీన్ని ప్రవేశపెట్టిన తీరు కూడా సందేహాలకు తావిస్తోంది. దేశంలో సెక్యులరిజం అప్రస్తుతం. శతాబ్దాలుగా ఇక్కడ అన్ని మతాలు సమానంగా గౌరవం పొందుతున్నాయి.   

 

అలాగే , స్వదేశీ అనగా కేవలం వస్తువులు , సేవలకు సంబంధించినదిగా అభివర్ణిస్తున్నారు కొందరు. కానీ అది దేశభక్తికి సంబంధించిన విషయం. ఇది జాతీయ స్వావలంబన , సార్వభౌమాధికారం , స్వాతంత్ర్య పరిరక్షణతో పాటు అంతర్జాతీయ సహకారాన్ని సమాన స్థాయిలో సాధించడానికి నిర్ణయించిన స్ఫూర్తికి సంబంధించినది. స్వదేశాభిమానులైనంత మాత్రాన అంతర్జాతీయతత్వానికి వ్యతిరేకం కాదన్నారు.       

 

 1893 లో ప్రపంచ మతాల పార్లమెంటులో స్వామి వివేకానంద చెప్పినట్లుగా హిందూత్వ ’ ‘ అంగీకారాన్ని విశ్వసిస్తుంది. " మేము సహనానికి అతీతంగా ఉంటాము మరియు ఆరాధన యొక్క అన్ని మార్గాలు నిజమని మేము అంగీకరిస్తాము ," అని ఆర్ఎస్ఎస్ సహకార్యదర్శి అయిన మన్మోహన్ వైద్య తెలిపారు.     ఒక్కమాటలో చెప్పాలంటే హిందూత్వ సారాంశం ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం.   

 

మానవజాతి మరింత మానవీయ , దోపిడీ లేని , సమగ్రమైన ఆధ్యాత్మికతతో ఉన్నతమైన     మార్గానికి కట్టుబడి ఉండాలి.  ' ధర్మం ' యొక్క సర్వ-సమగ్ర భావన రాజకీయ , ఆర్థిక సామాజిక జీవితాన్ని పునర్నిర్మించే మార్గదర్శకాలను అందిస్తుందని గ్రహించాలని మన్మోహన్ వైద్య అన్నారు..   

 


2021-11-25  News Desk

rajapush