6tvnews

Header - Ramky
collapse
...
Home / తెలంగాణ / న్యూస్ / హైదరాబాద్ / శివశంకర్ మాస్టర్ ను ఆదుకుంటా: సోనూసూద్

శివశంకర్ మాస్టర్ ను ఆదుకుంటా: సోనూసూద్

2021-11-25  News Desk
venus

sonu sood1
 

శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమం    

ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉంది. కోవిడ్ బారిన పడిన ఆయన ప్రస్తుతం ఆయన ప్రస్తుతం గచ్చిబౌలిలోని చికిత్స పొందుతున్నారు. ఆయన భార్య కూడా కరోనా వైరస్ సోకడంతో హోం క్వారంటైన్ లో ఉన్నారు. శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు కూడా కోవిడ్ బారిన పడ్డాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రి ఖర్చులు భరించలేకపోతున్నామని, దాతలు తమకు సాయం చేయాలని మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ కోరుతున్నారు. ప్రస్తుతం చికిత్సకు రోజుకు రెండున్నర లక్షల ఖర్చు అవుతోందని అజయ్ తెలిపారు. 

చేతనైనంత సాయం చేస్తా: సోనూ సూద్    

గత ఐదు రోజులుగా కరోనాతో పోరాడుతున్న శివశంకర్ మాస్టర్ గురించి నటుడు సోనూ సూద్ తెలుసుకున్నారు. మాస్టర్ కుమారుడు అజయ్ కృష్ణతో మాట్లాడారు. మాస్టర్ ప్రాణాలు కాపాడడానికి తనకు చేతనైనంత సాయం చేస్తానని ట్వీట్ చేశారు. 

sonu sood
 


2021-11-25  News Desk

rajapush