6tvnews

Header - Ramky
collapse
...
Home / వినోదం / తెలుగు / మిల్కీ బ్యూటీ క్యూట్ పిక్స్ వైరల్

మిల్కీ బ్యూటీ క్యూట్ పిక్స్ వైరల్

2021-11-25  Entertainment Desk
venus

tamannah
Picture Courtesy : Instagram / Tamannahspeaks 

మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియా రీసెంట్ పోస్టింగ్స్ వైరల్ అవుతున్నాయి. అమ్మవారి అవతారంలో అరిటాకులో టిఫిన్ చేస్తూ ఫోటోకు ఫోజులిచ్చింది. ఈ ఫోజులో తమన్నా చూడముచ్చటగా ఉంది. షూటింగ్ గ్యాప్ సందర్భంగా తీసిన ఈ ఫోటోలు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో తమన్నా పోస్టు చేసింది. వీటిని చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. తమన్నా క్యూట్ లుక్స్ చూసి ఫిదా అవుతున్నారు. 

పిక్స్ పోస్టు చేయడంతో పాటు తన భావాలను కూడా తమన్నా వ్యక్త పరిచింది. అరటి ఆకులో ఆహారం తింటే దేవతననే భావం కలుగుతోందని తెలిపింది. అరటి ఆకులు మనకు సులభంగా లభ్యమౌతున్నాయని..వాటిలో ఆహారం చేవిస్తే పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్లమౌతామని తమన్నా పోస్టు చేసింది. 

తమన్నా సినీ పరిశ్రమలోకి వచ్చి 15 సంవత్సరాలు దాటింది. ఈ కాలంలో మిల్కీ బ్యూటీ 50కి పూగా సినిమాల్లో నటించింది. ఇటీవల కాలంలో సీటీమార్ చిత్రంలో నటించింది. నితిన్ తో కలిసి అంధాధున్ రీమేక్ చిత్రం మ్యాస్ట్రోలో నటించింది. ప్రస్తుతం వెంకటేశ్, వరుణ్ సందేశ్ లతో కలిసి ఎఫ్ 3 చిత్రంలో నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోళాశంకర్ చిత్రంలో నటిస్తోంది.


2021-11-25  Entertainment Desk

rajapush