6tvnews

Header - Ramky
collapse
...
Home / వినోదం / తెలుగు / ర‌ష్మికి మెగా ఆఫ‌ర్

ర‌ష్మికి మెగా ఆఫ‌ర్

2021-11-25  Entertainment Desk
venus

chiranjeevi1
 

ర‌ష్మి బుల్లితెర యాంక‌ర్‌. ర‌ష్మి గురించి తెలియ‌ని వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. బుల్లితెర షోల‌లో న‌టిస్తూనే సినిమాల‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంది. ఇప్పటికే రష్మీ కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అమ్మడు మెగా ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ చిత్రంలో రష్మీ ఒక ఐటెం సాంగ్ చేయనుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా కనిపిస్తుండగా.. రష్మీ ఒక ఐటెమ్ సాంగ్ చేయ‌నుంద‌ట‌. అది కూడా  చిరు పక్కన చిందేయ‌నుంద‌ట‌. 

ఒక‌సారిగా మెగాస్టార్ చిరంజీవి ప‌క్క‌న డాన్స్ అంటే మాములు మాట‌లా... చిరు సరసన డాన్స్ అంటే మాటలు కాదు.. అందులోను ఐటెం సాంగ్ అంటే మాస్ మసాలా, అందాల ఆరబోత మాములుగా ఉండ‌దండోయ్‌. ఇక‌ అందాల ఆరబోత విష‌యానికి వ‌స్తే... అందులో రష్మీ తగ్గేదేలే అంటున్న విషయం తెల్సిందే. అందుకే మెగా కాంపౌడ్‌లోకి రష్మిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక జబర్దస్త్ బ్యూటీ అనసూయ కూడా ఇలాగే స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తూ మంచి పేరు తెచ్చకుంది. ఇక సీనియర్ బాటలోనే జూనియర్ రష్మీ కూడా నడుస్తుంది అన్న మాట. మరి ఈ వార్తలో నిజమెంత ఉందొ తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. 

అలాగే అన‌సూయ‌కి ఇప్ప‌టికే సినిమాల్లో బాగానే ఛాన్స్‌లు వ‌చ్చాయి. సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో రంగ‌మ‌త్త‌గా రంగ‌స్థ‌లంలో మంచి పేరు తెచ్చింది. ఆలాడే ఒక లేడీ ఓరింయ‌టెడ్ మూవీలో కూడా న‌టించింది. మ‌రే అదే విధంగా ర‌ష్మి కూడా గుంటూరు టాకీస్ అనే చిత్రంలో లీడ్ క్యారెక్ట‌ర్ చేసిన‌ప్ప‌టికీ అనుకున్న స్థాయిలో ర‌ష్మికి పేరు రాలేదు. మ‌రి అన‌సూయ లాగానే మంచి పేరు సంపాదించాలంటే ఏద‌న్నా ఒక మంచి పాత్ర ప‌డాల్సిందే. ఈ భోగాశంక‌ర్‌తోనైనా ర‌ష్మికి పేరు వ‌స్తుందేమో చూడాలి. 


2021-11-25  Entertainment Desk

rajapush