6tvnews

Header - Ramky
collapse
...
Home / క్రీడలు / బ్యాడ్మింటన్ / ఇండోనేషియా ఓపెన్ టోర్నీలో పీవీ సింధు దూకుడు

ఇండోనేషియా ఓపెన్ టోర్నీలో పీవీ సింధు దూకుడు

2021-11-25  Sports Desk
venus

pv sindhu1
 

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేషియా ఓపెన్ టోర్నీలో అదరగొడుతోంది. జర్మనీ ప్లేయర్ యోనీలీని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ చేరింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆధిక్యం కనబరిచిన సింధు.. ప్రత్యర్ధిని కోలుకోనివ్వకుండా విరుచుకుపడింది. వరుస సెట్లతో సునాయాస విజయం సొంతం చేసుకుంది. కేవలం 37 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించింది. 

వరుస సెట్లలో విజయం   

ప్రీక్వార్టర్ మ్యాచ్ త్వరగా ముగిసింది. 21-12, 21-18 తేడాతో జర్మన్ ప్లేయర్ ను సింధు చిత్తు చేసింది. తొలి సెట్లో అద్వితీయ ఆటతీరును కనబరిచింది. రెండో సెట్ లో జర్మన్ ప్లేయర్ కోలుకుని ధీటుగా ఆడింది. సింధును ఎదుర్కొని చాలా సేపటి వరకు నిలబడింది. చివరకు తలవంచింది. క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్  స్పెయిన్ క్రీడాకారిణితో గానీ, కొరియాకు చెందిన ప్లేయర్ తో గానీ జరగనుంది. 


2021-11-25  Sports Desk

rajapush