6tvnews

collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / వైజాగ్ / విశాఖలో ఘనంగా వెంకన్నకళ్యాణం

విశాఖలో ఘనంగా వెంకన్నకళ్యాణం

2021-11-27  News Desk

 

VSO MARRIAGE 2
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారితో సహా ఇతర రోగాల నుండి ప్రజలను రక్షించాలని కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని లోకకళ్యాణార్ధం విశాఖలో వెంకన్న కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గడచిన రెండురోజులుగా స్వామివారికి ప్రత్యేక పూజలు,రాయవరం గ్రామంలో పల్లకీ ఊరేగింపు కావించి శ్రీభూదేవి సమేత వైభవ వేంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం జరిపించారు. 

రక్షించు స్వామీ

గడిచిన కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలు వరద ముంపుకు గురైన ప్రజలందరూ త్వరగా కష్టాలనుంచి బయట పడాలని నిర్వాహకులు భగవంతుడిని ప్రార్ధించారు. ఈ ఏడాది పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని గోవింద నామస్మరణతో విశాఖ మారుమోగిపోయింది. ఈ కళ్యాణోత్సవంలో జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా నవ యువ దంపతులతో పాటు వృద్ధ దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిస్వామివారి  కళ్యాణ అక్షింతలు ప్రసాదంగా పంపిణి చేశామని జిల్లా వై.ఎస్. ఆర్. సి. పి సీనియర్ నాయకులు బొలిశెట్టి గోవిందు తెలిపారు.


2021-11-27  News Desk