6tvnews

collapse
...
Home / వినోదం / హిందీ / గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సిద్ధార్థ్ మల్హోత్రా

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సిద్ధార్థ్ మల్హోత్రా

2021-11-27  Entertainment Desk

GREEN 4
బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో  పాల్గొన్నారు. ముంబాయిలోనిఅంధేరి వెస్ట్ చిత్రకూట్ స్టూడియోలో తన తాజా సినిమా యోధ” చిత్రీకరణలో పాల్గొన్న సిద్ధార్థ్.. సినిమా డైరెక్టర్లు సాగర్ అంబ్రే మరియు పుష్కర్ ఓజాతో కలిసి  మొక్కలను నాటారు. సినిమా ముహూర్తానికి ముందే మొక్కలు నాటి ఒక అద్భుతమైన సంప్రదాయానికి తెరతీసారు డైరెక్టర్లు.

మొక్కలు నాటడం సంతోషంగా ఉంది: సిద్ధార్థ్

గ్రీన్ ఇండియా చాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సిద్ధార్థ్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోతున్న  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి కృషిని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని సిద్ధార్ద్ ప్రశంసించాడు. గ్రీన్ ఇండియా చాలెంజ్” గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టడానికి దోహదపడుతుందని, భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుందని యంగ్ హీరో తెలిపాడు.  అందుకే  ప్రతి ఒక్కరు బాధ్యతగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చాడు. ఈ కార్యక్రమంలో.. ప్రముఖ ఆస్ట్రాలజర్  బాలు మున్నంగితో పాటు గ్రీన్ ఇండియా చాలెంజ్” కో ఫౌండర్ రాఘవ, ఇతర సినిమా బృందం పాల్గొన్నారు.


2021-11-27  Entertainment Desk