6tvnews

collapse
...
Home / అంతర్జాతీయం / కరోనా కొత్త వేరియంట్ కలకలం

కరోనా కొత్త వేరియంట్ కలకలం

2021-11-27  News Desk

CORONA VIRUS 2
 

కరోనా వైరస్ కొత్త వేరియంట్ బి  1.1.529      ప్రబలిందన్న వార్తల నేపధ్యంలో భారత్ అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్ పై ఆందోళనలు వ్యక్తమవుతున్నసందర్భంలో ప్రధాని నరేంద్ర మోడి ఉన్నతాధికారులతో ఉన్నత్థస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇదే సమయంలో దేశంలోని వ్యాక్సినేషన్ ప్రక్రియపై కూడా చర్చించారు. బి  1.1.529 వైరస్ (దీనికి  ఒమిక్రాన్ ‘  అని డబ్ల్యుహెచ్ఓ పేరు పెట్టిం ది) వివిధ మ్యుటేషన్స్ తో వేగంగా వ్యాప్తి చెందడమేగాక దాని లక్షణాలు కూడా తీవ్రంగా ఉంటాయని వ్యాక్సిన్ కు  కూడా లొంగని విధంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

' ప్రమాదం కాదని భావించిన దేశాలకు మాత్రమే విదేశీ ప్రయాణాలు రాకపోకలు మామూలు స్థితికి చేరుకుంటాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల సడలించిన వీసా పరిమితులు అంతర్జాతీయ ప్రయాణాలను పునరుద్ధరించడంతో ఈ వేరియంట్ వల్ల తీవ్రమైన ప్రజారోగ్య ప్రభావాలు ఉన్నాయని  ఆరోగ్య మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. అందువల్ల దక్షిణాఫ్రికా బోట్స్వానా , హాంకాంగ్ ల నుండి వచ్చే ప్రయాణీకులను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని నిర్ణయించింది.

బి 1.1.529  అంటేఏమిటి..?   

బి. 1.1.529 వేరియంట్ ను ఆందోళనకరమైనదిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO) గుర్తించింది. దీనికి ఓమిక్రాన్ అని పేరు మార్చింది.  దీన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన డెల్టా వేరియంట్ తో పాటు  ఆల్ఫా బీటా ,గామాతో హై-అలర్ట్ కేటగిరీలో ఉంది.

ఈ వారం దక్షిణాఫ్రికాలో బి. 1.1.529 వేరియంట్  బయటపడింది. ఆ తర్వాత బోట్స్వానా హాంకాంగ్ ఇజ్రాయెల్ , బెల్జియంలో కూడా కనబడిందని వార్తలు వెలువడ్డాయి. ఈ వేరియంట్ కు  50 మ్యుటేషన్స్ (ఉత్పరివర్తనలు) ఉన్నాయని వీటిలో స్పైక్ ప్రోటీన్‌పై  30 మరియు రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో  10 ఉన్నాయి. వ్యాక్సిన్ వీటిని నిరోధించగలుగుతుందా లేదా అనేవిషయమై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. భారత్ ను వణికించిన డెల్టా వైరస్ కంటే  B.1.1.529 అంటురోగంగా ఉంటుందంటున్నారు.

 తొందర పడవద్దు: WHO

కాగా యునైటెడ్ కింగ్‌డమ్ సింగపూర్ ఇజ్రాయెల్ దక్షిణాఫ్రికా , బోట్స్‌వానాతోపాటు ఇతర నాలుగు ఆఫ్రికన్ దేశాల నుండి విమానాలను నిలిపివేసాయి. జర్మనీ ఇటలీ కూడా దక్షిణాఫ్రికా నుండి చాలా ప్రయాణాలను నిషేధించాయి. అయితే దీనిని దక్షిణాప్రికా ఆక్షేపించింది. ప్రమాద స్థాయిని బట్టి శాస్త్రీయ విధానంతో వ్యవహరించాలని WHO సూచించింది. ఏది ఏమైనా వ్యాక్సిన్ ప్రాముఖ్యాన్ని గుర్తించాలని 

WHOకి చెందిన కోవిడ్-19 టెక్నికల్ లీడ్ డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ సూచించారు.

కనిష్టంగా కొత్త కేసులు

నవంబర్ 26 ఉదయం నాటికి ఏడు రోజుల కొత్త కేసుల సగటు 10,000 కంటే తక్కువగా ఉంది. ఇది గత సంవత్సరం జూన్ నుండి నమోదైన అత్యల్ప యాక్టివ్ కేసులు. అయితే కొత్తగా వస్తున్న ఒమెక్రాన్ తీవ్రత పై శాస్త్రవేత్తల హెచ్చరికలతో ఈ అంటువ్యాధి వైరస్ పై ఆందోళన వ్యక్తమవుతోంది. భారతదేశంలో టీకా కవరేజీలో ఇప్పటికీ కొన్ని ఇతర దేశాలతో పోలిస్తే తక్కువుగానే ఉంది. ఐనప్పటికీ 120.3 కోట్ల డోసులు మాత్రమే ఇచ్చారు. వీటిలో రెండో డోస్ 42.6 కోట్ల మందికి మాత్రమే ఇచ్చారని గణాంకాలు చెబుతున్నాయి.

 

 


2021-11-27  News Desk