6tvnews

collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / పశ్చిమ గోదావరి / జనసంద్రంగా మారిన తిరుమలేశుని సన్నిధి

జనసంద్రంగా మారిన తిరుమలేశుని సన్నిధి

2021-11-27  News Desk

6-1
ద్వారకా తిరుమల చిన్న తిరుమలేశుని ‌సన్నిధి భక్తజన సంద్రంగా మారింది. దీంతో శేషాచలం గోవింద నామాలతో మారుమ్రోగింది. కార్తీక మాసంలో నాల్గవ శనివారం కావటంతో క్షేత్రపరిసరాలు భక్తులతో నిండిపోయాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారినిఅమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తులను ఆలయ సిబ్బంది ముందుగా శానిటైజర్ తో చేతులను శుభ్రపరిచిధర్మల్ స్కానర్ ద్వారా ఉష్ణోగ్రతను పరీక్షించిదర్శనానికి అనుమతించారు. 

జనసంద్రంగా మారిన తిరుమలేశుని సన్నిధి

గత కొద్ది  వారాల నుంచి కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టడంతో భక్తుల రాక ఆలయానికి గణనీయంగా పెరిగింది. దీంతో వేలాదిగా తరలివచ్చిన భక్తులతోనూ వారి వాహనాలతో శేషాచల ఘాట్ రోడ్డు కిటకిటలాడింది. అలాగే  స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కేశఖండన శాలప్రసాదాల కౌంటర్ లుక్యూ కాంప్లెక్స్ లుభక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు అవసరమైన సౌకర్యాలను సమకూర్చారు. వేలాది మంది భక్తులు తమ తలనీలాలను స్వామివారికి భక్తి ప్రపత్తులతో సమర్పించుకున్నారు. 

దర్శనానికి సుమారు 3 గంటలు

మొక్కుబడులు తీర్చుకున్న వారు స్నానాది కార్యక్రమాల అనంతరం గంటల తరబడి వేచి ఉండి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి షుమారు 3 గంటల పైబడి సమయం పట్టింది. దర్శనానంతరం శ్రీ వకుళమాత అన్నప్రసాద భవనంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే గోవింద దీక్షాధారులు ఇరుముడులు ధరించి వచ్చి స్వామి వారికి వాటిని సమర్పించారు.

8-1
 


2021-11-27  News Desk