6tvnews

collapse
...
Home / జాతీయం / భారతదేశ పేదరికంపై నీతి ఆయోగ్ ఏం చెబుతోంది ?

భారతదేశ పేదరికంపై నీతి ఆయోగ్ ఏం చెబుతోంది ?

2021-11-27  News Desk

7-1
 

వివిధ రకాల అంశాలలో వివిధ రాష్ట్రాలలోని వాస్తవ స్థితిగతులను నీతి ఆయోగ్ ఒక నివేదికలో సవివరంగా తెలియజేసింది. బీహార్ చాలా విషయాల్లో బాగా వెనుకబడిన రాష్ట్రంగా ప్రత్యేకతను సంతరించుకుంది. అత్యంత పేద రాష్ట్రంగా మాత్రమే కాకుండా మాతృత్వపరంగా ఆరోగ్య ఫలాలు అందుకునే వారి శాతం కూడా చాలా అట్టడుగున ఉంది. ఇంకాపాఠశాల విద్యాబోధన కరువైన బాలలవారి హాజరీ విషయంలో కూడా బీహార్ అట్టడుగునే ఉంది. వంట గ్యాస్ కానీవిద్యుత్ సౌకర్యం కానీ చాలా కుటుంబాలకు అందుబాటులో లోని దుస్థితి. 

మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్

విభిన్న అంశాలలో వెనుకబాటుతనం సూచిక (మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్) ప్రకారం బీహార్ఝార్ఖండ్ఉత్తర ప్రదేశ్ అట్టడుగు స్థానంలో నిలిచాయి. బీహార్ ప్రజలలో 51.91 శాతం మంది నిరుపేదలే. ఝార్ఖండ్ లో ఇది 42.16 శాతంఉత్తరప్రదేశ్ లో 37.79 శాతం. వీటి తరువాత నాలుగో స్థానంలో మధ్యప్రదేశ్ (36.65 శాతం)అయిదో స్థానంలోమేఘాలయ (32.67 శాతం) ఉంది. 

కేరళ (0.71 శాతం)గోవా (3.76 శాతం)తమిళనాడు 4.89 శాతం)పంజాబు 5.59 శాతం) రాష్ట్రాలలో తి తక్కువ స్థాయిలో పేదరికం ఉన్న రాష్ట్రాలుగా నిలిచాయి. 

కేంద్రపాలిత ప్రాంతాలలో దాద్రా-నాగర్ హవేలీ (27.36 శాతం)జమ్ము-కాశ్మీర్లఢఖ్ ప్రాంతాలు (12.58 శాతం) దామన్-డయ్యూ ప్రాంతం 6.82 శాతం)చండీగఢ్ (5.97 శాతం) ప్రాంతాలు అత్యంత పేద ప్రాంతాలుగా స్థానం సంపాదించుకున్నాయి. ఇక పుదుచ్చేరిలో 1.72 శాతంలక్షద్వీప్ లో 1.82 శాతంఅండమాన్-నికోబార్ దీవులలో 4.30 శాతం) ఢిల్లీ లో (4.79 శాతం) మెరుగైన స్థానాలలో ఉన్నాయి. 

బీహార్ లో అత్యధిక జనాభా సమస్య

పోషకాహార లోపం సమస్యతో బీహార్ లో అత్యధిక జనాభా బాధపడుతున్నారు. ఈ విషయంలో తరువాతి స్థానాలలో ఝార్ఖండ్మధ్యప్రదేశ్ఉత్తరప్రదేశ్చత్తీస్ గఢ్ రాష్ట్రాలలో ఎక్కువ మందికి పోషకాహారం అందడం లేదు. చిన్నారులుచిరుప్రాయం వారి మరణాల విషయంలో ఉత్తరప్రదేశ్ అద్వాన్న స్థితిలో ఉంది. ఇదే స్థాయిలో బీహార్,   మధ్యప్రదేశ్ ఉండగా ఝార్ఖండ్ అత్యంత బాధాకరమైన స్థితిలో ఉంది. 

అంతర్జాతీయంగా ఆమోదం పొందిన ప్రమాణాలను ఆధారం చేసుకుని ఈ సూచికను రూపొందిస్తారు. ఇందుకు అవసరమైన ప్రామాణిక స్వరూపాన్ని ఆక్స్ ఫర్డ్ పావర్టీ (పేదరికం అండ్ హ్యూమన్ డెవలప్ మెంట్ (మానవ అభివృద్ధి) ఇనీషియేటివ్ అనే సంస్థ ఐక్యరాజ్యసమితి డెవలప్ మెట్ ప్రోగ్రామ్ (యూఎన్ డిపీ) సంయుక్తంగా తయారుచేసాయి. ముఖ్యంగా మూడు కోణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నివేదికను తయారుచేస్తారు. అవి ఆరోగ్యంవిద్యజీవన ప్రమాణాలు. వీటని 12 అంశాల ప్రాతిపదికగా పోషకాహార లభ్యతచిన్నారులుచిరుప్రాయం బాలబాలికలలో మరణాల తీరుప్రసవానంత (ఆయంటీనాటల్) ఆరోగ్య సంరక్షణపాఠశాల చదువుల తీరువిద్యార్థుల హాజరీవంట ఇంధనం (గ్యాస్ లభ్యత)పారిశుభ్రతతాగు నీరువిద్యుత్ సదుపాయంగృహవసతిఆస్తులుబ్యాంక్ ఖాతాలు పరిశీలిస్తారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తన ముందుమాటలోఇలాంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్సును నేషనల్ ప్యామిలీ హెల్త్ సర్వే (2015-16 కాలం నాటి) లోని అంశాల ఆధారంగా చేపట్టడం ఇదే మొదటిసారని తెలిపారు. అదే విధంగా నీతి ఆయోగ్ సీఈఓ అమితాభ్ కాంత్ ముందుమాట రాస్తూపేదరికం నిర్మూలనకు చేపట్టదలచిన సస్టయినబుల్ డెవలప్ మెంట్ లక్ష్యాలు సాధించేందుకు ఈ సూచిక ఉపయోగపడుతుందని వివరించారు. 


2021-11-27  News Desk