పంచారామ క్షేత్రాలలో ఒకటైన తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి వారిని నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. కుమారరామ భీమేశ్వర స్వామివారిని ప్రతి సంవత్సరం దర్శించుకుంటానని , దీనిలో భాగంగా ఈ సంవత్సరం కూడా సామర్లకోట పంచరామాల్లో ఒకటై నటువంటి కుమారరామ భీమేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ప్రజలకు అండగా ఉంటా: రోజా
స్వామివారి బలంతో ప్రజలకు అండగా ఉంటానని , పంచరామాల్లో ఒకటైనటువంటి అమరేశ్వరుని దర్శించుకోవడం జరిగిందని , ఇవాళ భీమేశ్వర స్వామి దర్శనం చేసుకున్నామని మిగిలిన మూడు పంచారామాలను ఈరోజు రేపు దర్శించుకుంటానని , కార్తీకమాసంలో శివుని విష్ణువుని వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని తనతో పాటు ఈ రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని రోజా తెలిపారు.